సమాచార హక్కు చట్టం అంటే:

 సహ చట్టం సెక్షన్ 2(జే)ప్రకారం పాలనలో పార దర్శకత ,జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ  యంత్రాంగం అదుపులో వున్న సమాచారాన్ని పౌరులు పొందడం.

 1.సమాచారం అంటే:             ప్రభుత్వకార్యాలయాల్లోనిసహచట్టం,సెక్షన్2(ఎఫ్)మేరకురికార్డులు,పత్రాలు,మేమోలు,ఈమైల్,అబిప్రాయాలు,ఆదేశాలు,ఒప్పందాలు,పత్రికప్రకటనలు,ఒప్పందాలు,కాంట్రాక్టులు,సర్క్యులర్లు,ఉత్తర్వులు,నమూనాలు,సలహాలు,కమ్ప్యూటర్లలో నిక్షిప్తంఅయన డేటా,సీడీ,డీవీడీ,ప్లాపి,మరే ఇతర రూపంలో వున్న సమా చారం.

2. సమాచారాన్ని ఎవరిని అడగాలి అంటే

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 5(1) మేరకు ప్రజా సమాచార  అదికారి/సహాయ ప్రజా సమాచార అదికారి వుంటారు. సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలి.అతనికి మనకు కావాల్సిన సమాచారాన్ని దరకాస్తు చేసుకొని పొందవచ్చు.

3.దరఖాస్తు నమూనా వుందా?

సహ చట్టం మేరకు దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు. తెల్లకాగితంపై సమాచారం కోసం విన్నపం అని వ్రాసి ఇస్తే చాలు.

4.దరకాస్తు రుసుము వివరాలు:-

గ్రామస్థాయి సంస్థలకు---ఉచితం

మండలస్థాయిలో-----5/-రూ:,

జిల్లా,రాష్ట్ర,కేంద్ర స్థాయి సంస్థలకు :-------------10/రూ: చెల్లించాలి.

5.ధరకాస్తు రుసుము ఎలా చెల్లించాలి

జీ.ఓ.ఎంఎస్.నెం:740,సహచట్టం,సెక్షన్7(3)మేరకునగదు,ఇండియన్పోస్టల్ఆర్డర్(postalorder),బ్యాంకుచెక్కు,డి.డి,ఛలాన,రూపంలోచెల్లించవచ్చు.

6.దరకాస్తు రుసుం ఉచితం::-

సహ చట్టం,సెక్షన్ 7(5)మేరకు దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి ఉచితం. రేషన్ కార్డు వున్న వారికి వర్తిస్తుంది.

7.సమాచారం ఎందుకు అని అడిగే అధికారం ఎవరికి లేదు:

సహ చట్టం,సెక్షన్ 6(2) ప్రకారం కోరుతున్న సమాచారం ఎందుకని దరకాస్తుదారిని అడిగే అధికారం ఎ అదికారికి లేదు.

8. సమాచారం ఇవ్వటకు గడువు వుందా:

సహ చట్టం-2005,సెక్షన్ 7(1)మేరకు 30రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి.

9.అత్యవసర సందర్భంలో ఇవ్వాల్సిన సమాచారం::-

వ్యక్తి స్వేచ్ఛ,జీవించే హక్కులకు భంగం కలిగే సందర్భంలో 48గంటల్లో ఇవ్వాలి.

10. సమాచారం ఇవ్వకుంటే::-

సహచట్టం,సెక్షన్19(1) మేరకు ప్రభుత్వ కార్యాలయం యొక్క వున్నత అదికారికి మొదటి అప్పీలు చేయాలి.30-45రోజుల్లో సమాచారం ఇవ్వాలి.

11.అప్పటికి సమాచారం రాకుంటే::-

90రోజుల వ్యవదిలోరాష్ట సమాచార కమీషన్కు, సెక్షన్ 19(3)మేరకు అప్పీలు చేయాలి:గడువు సహ కమిషన్ నిర్దేశిస్తుంది.

12. సమాచారం ఇవ్వని అదికారులకు జరిమానా, శిక్షలు ఏమైన వున్నాయా:-

దరకాస్తు తీసుకోవడానికి నిరాకరించిన,ఎక్కువ దరకాస్తు రుసుం కోరిన,తెలిసి అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చిన, సమాచారం నిరాకరించడం, కోరిన సమాచారాన్ని ద్వంసం  చేయడం,సమాచారం ఇవ్వడాన్ని అడ్డుకోవడం ఇవ్వన్నీ నేరాలే వీటికి పాల్పడిన ప్రజా సమాచార అదికారికి సహ చట్టం,సెక్షన్ 20(1)మేరకు రోజుకు 250నుండి 25,000వేల వరకు జరిమానా విధించే అదికారం సహ కమీషన్కు వున్నది. తరచూ సహ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అదికారులకు సెక్షన్20(2) మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు.

13.నిర్దిష్ట వ్యవధి దాటిన సమాచారం ఉచితంగా ఇవ్వాలి::-

సహ చట్టం,సెక్షన్ 7(6)మేరకు 30రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి.

14.స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారం::

సహ చట్టం,సెక్షన్ 4(1)(బి)మేరకు ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విధులు,భాద్యతలు,విధినిర్వహనలో పాటించే సూత్రాలు,జవాబుదారీతనం,పారదర్శకతకు వున్న మార్గాలు,ఉద్యోగులు వివరాలు ,వారి నెలవారి జీత భత్యాలు,బడ్జెట్ కేటాయింపు,రికార్డుల పట్టికలు,రాయితీల వివరాలు,పీఐఓల వివరాలు,సలహా సంఘాలు తదితర వాటికి సంబందించిన 17 అంశాల సమాచారం ఎవరూ అడుగక ముందే స్వచ్ఛందంగా వెల్లడించాలి.

 15.నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిందే::-

సహ చట్టం,సెక్షన్ 4(1)(సి)మేరకు ముఖ్యమైన విధానాలు రూపొందించే టపుడు,ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలు ప్రకటించే టపుడు వాటికి సంబందించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.అంటే కొత్త చట్టాలు తెచ్చే ముందు, ఉన్నవాటికి సవరణలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.

16. రికార్డుల తనిఖీ చేసే అదికారం ఎవరికైన ఉంది:

దరకాస్తు చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోన్ని అన్ని రికార్డులను,చేపడుతున్న అభివృధి కార్యక్రమాలను అధికారుల సమక్షంలో పరిశీలించవచ్చు,(నిర్మాణ పనులు, ప్రజా సంక్షేమ పధకాల అమలు) కావలసిన రికార్డులను సహ చట్టం,సెక్షన్ 2(జె)(1)మేరకు తనిఖీ చేయవచ్చు.& సహ చట్టం, సెక్షన్ 2(జె)(2)మేరకు నకలు,ఫోటో,వీడియో పొందవచ్చు ,అయీతే సమాచార ప్రతిపై పిఐఓ ధ్రువికరించి ఇవ్వాలి.

17.సమాచారం పొందుటకు చెల్లించాల్సిన రుసుములు వివరాలు::-

జీఓ ఎంఎస్.నం:454 మేరకు

A3/A4 కాగితానికి----2/-రూ..

ప్లాపికి -------------------50/-రూ.

సీడీ కి -----------------100/-రూ.

డి వి డి కి -------------200/-రూ.

18 సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపు పొందినవి:-

సహ చట్టం,సెక్షన్ 8 మేరకు దేశ భద్రత,సమగ్రతకు ముప్పు వాటిల్లె,ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే,పొరుగు దేశాలతో మైత్రి చెడిపోయే,చట్ట సభల హక్కులకు భంగం కల్గే సందర్భలలో ఈ చట్టం వర్తించదు.

19. భద్రతా,నిఘా సంస్థలకు మినహాయింపు ఉంది-

సహ చట్టం,సెక్షన్ 24 మేరకు దేశ భద్రత,నిఘా సంస్థలైన ఇంటెలిజెన్స్ బ్యూరో,రెవెన్యూ  ఇంటెలిజెన్స్,రా(క్యాభినేట్ సెక్రటేరియట్ రీసెర్చ్&అనాలసిస్ వింగ్),కేంద్ర రిజర్వు పోలీస్ దళం,సరిహద్దు భద్రత బలగం,కేంద్ర పారిశ్రామిక భద్రత దళం,జాతీయ రక్షక దళం,ఇండియన్-టిబెట్ సరిహద్దు బలగం,అస్సాం రైపిల్ ఫోర్స్,ఏన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్,సిఐడి-అండమాన్ నికోబార్,స్పెషల్ బ్రాంచ్ సిఐడి-లక్యదీప్,ఏరోనాటికల్స్ రీసెర్చ్ కేంద్రం లాంటిికి మినహాయింపు  వుంది.అయీతే ఇందులో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనకు సంబందించిన  సమాచారం తీసుకోవచ్చు.

20.ఒక సంస్థకు సంబందం కానిదైతే సంబందిత సంస్థకు పంపాలి::-

సహచట్టం,సెక్షన్6(3) మేరకు దరకాస్తుదారుడు కోరిన సమాచారం ఒక సంస్థకు (కార్యాలయానికి)చెందినది కానట్టఐతే సదరు పిఐఓ సంబందిత సంస్ధకు  పంపాలి.దరకాస్తు అందిన "5" రోజుల్లోపు పంపి విషయం దరకాస్తుదారుడికి చెప్పాలి. అంటే::-

21. చట్టం పరదిలోకి వచ్చే సంస్థలు:

సహ చట్టం, సెక్షన్2(h) మేరకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ  కార్యాలయాలు&సెక్షన్ 2(h)(2)ప్రకారం ప్రభుత్వాల నుండి ప్రత్యక్షంగా,పరోక్షంగా,నిధులు,రాయితీలు,భూకేటాయింపులు పొందిన ప్రయీవేటుసంస్థలు కూడా అదికార యంత్రాంగాల క్రిందకు వస్తాయి.

22. దరకాస్తుదారు కోరిన రూపంలోనే సమాచారం ఇవ్వాలి:-

సహ చట్టం,సెక్షన్ 7(9) మేరకు ఎక్కువ ఆర్థిక వనరులు ఖర్చైయ్యే,రికార్డు భద్రత ప్రమాదంలో పడుతున్న సంధర్భంలో తప్పా దరఖాస్తుదారు కోరిన రూపంలో సమాచారం ఇవ్వాలి.

23.దరకాస్తుదారుడి పై చర్యకు అవకాశం లేదు::-

సహ చట్టం,సెక్షన్ 21ప్రకారం ,ఈ చట్టం క్రింద రూపొందిన నిబంధనల మేరకు మంచి చేస్తున్నామని నమ్మకంతో ఎవరు ఏమి చేసిన, వారిపై ఎటువంటి ధావాలు వేయడం, న్యాయవిచారణ చేయడం,చట్టపరమైన చర్యకు తీసుకోవడం కుదరదు...

24.సహ కమీషన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఏ న్యాయ స్థానానికి లేదు::-

సహ చట్టం,సెక్షన్ 23మేరకు కమిషన్ జారీచేసిన ఆదేశాలపై దావాను వేయడం,ఇతర విచారణను ఏ న్యాయస్థానం  చేపట్ట కూడదు.ప్రశ్నించకూడదు.

25.దరఖాస్తుదారు పరిహారం పొందొచ్చు:

నిర్దేశిత గడువులో సమాచారం దొరకనప్పుడు కమిషన్కు వెళ్లాల్సి వస్తే సహ చట్టం సెక్షన్19(8)(బి) ప్రకారం పరిహారం పొందవచ్చు.

26.సహ చట్టం ప్రచార భాద్యత  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలది::-

సహ చట్టం తాలూకా ప్రయోజనాలను ప్రజలకు అందించి వారిలో అవగాహన కల్పించే భాద్యత సహ చట్టం సెక్షన్ 26 మేరకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల విధి.....

 

సమాచార హక్కు ను గురి౦చి తరచుగా అడిగే ప్రశ్నలు

 

సమాచార హక్కు చట్టం (ఆర్ టిఐ) కింద స‌మాచారం కోరే వారికి కొన్ని సూచ‌న‌లు:-

1. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎంఒ)లోని కేంద్ర ప్రజా స‌మాచార అధికారి (సిపిఐఒ) త‌మ కార్యాల‌యం ప‌రిధిలోని లేదా త‌మ వ‌ద్ద అందుబాటులో ఉన్న మ‌రియు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఎలకేష‌న్ ఆఫ్ బిజినెస్‌) రూల్స్, 1961. కింద నిర్వ‌చించిన మేర‌కు త‌మ విధుల ప‌రిధిలోకి వ‌చ్చే అంశాల‌పై స‌మాచారం అందిస్తారు.

2. కేంద్ర‌ ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌లు/విభాగాలకు సంబంధించిన అంశాలు

a) 2005 సంవ‌త్స‌ర‌ ఆర్ టిఐ చ‌ట్టం ప్ర‌కారం ఏదైనా ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌కు చెందిన లేదా సంబంధిత శాఖ ప‌రిధిలోని అంశంపై స‌మాచారం కోరిన‌ట్ట‌యితే ద‌ర‌ఖాస్తును ఆ శాఖ‌కు బ‌దిలీ చేస్తారు. ఈ కార‌ణంగా ద‌ర‌ఖాస్తుదారులు ఏ శాఖ నుండి స‌మాచారం కోరుతున్నారో ఆ మంత్రిత్వ శాఖ/విభాగం లోని ప్ర‌జా స‌మాచార అధికారికే నేరుగా ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్ట‌యితే వారి అభ్య‌ర్థ‌న‌లు స‌రైన స‌మ‌యంలో ప‌రిశీల‌న‌కు తీసుకునే వీలు ఉంటుంది. ఒక వేళ మంత్రిత్వ శాఖ‌లు/విభాగాల విధుల కేటాయింపు విష‌యంలో ఏవైనా అనుమానాలు ఉంటే అప్పుడు ద‌ర‌ఖాస్తుదారులు వారి ద‌ర‌ఖాస్తుల‌ను నేరుగా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఎలకేష‌న్ ఆఫ్ బిజినెస్‌) రూల్స్, 1961కు అనుగుణంగా సిపిఐఒ కు పంప‌వ‌చ్చు.b) బ‌హుళ శాఖ‌ల‌కు సంబంధించిన (ఉదాహ‌ర‌ణ : ఒక‌టి క‌న్నా ఎక్కువ మంత్రిత్వ శాఖ/విభాగం) అంశాల‌పై ద‌ర‌ఖాస్తులు వ‌స్తే వాటిని ఆయా శాఖ‌ల‌కు బ‌దిలీ చేసే అవ‌కాశం ఉండ‌దు. అలాంటి ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశాలు ఉంటాయి.

3. రాష్ర్ట‌ ప్ర‌భుత్వాలు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌ (యుటి) పాలన యంత్రాంగాలకు సంబంధించిన అంశాలు : రాష్ర్ట‌ ప్ర‌భుత్వాలు/ యుటి ల విధుల‌కు సంబంధించిన అంశాలైతే ద‌ర‌ఖాస్తుదారులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా రాష్ర్ట‌ ప్ర‌భుత్వం (ప్రభుత్వాలు)/ యుటి ల అధికార యంత్రాంగానికి పంపించుకోవాలి.

4. ఆయా రాష్ర్ట‌ ప్ర‌భుత్వాల ప‌రిధిలోని కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాల కు చెందిన ప్ర‌భుత్వాధికారుల నుండి స‌మాచారం కోరుతున్న‌ట్ట‌యితే భారత ప్ర‌భుత్వ వెబ్ డైరెక్ట‌రీలో లభ్యమయ్యే ఆయా శాఖల వెబ్ సైట్ (వెబ్ సైట్ ల)కు ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాలి.

5. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం రికార్డుల ప‌రిధిలోకి రాని అంశాల‌పై సిపిఐఒ స‌మాచారాన్ని నిక్షిప్తం చేయ‌దు. అలాగే దిగువ అంశాల‌కు చెందిన స‌మాచారాన్ని సిపిఐఒ అందించే అవ‌కాశం ఉండ‌దు.

a) ఏవో ఆధారాలు ఉన్నాయంటూ అనుమానాస్ప‌ద అంశాల‌పై కోరే స‌మాచారం;
b) కాల్పనిక అంశాలు;
c) ఏదో జ‌రిగిందంటూ అభిభాష్యాల‌తో కూడిన అంశాలు;
d) ద‌ర‌ఖాస్తుదారులు ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చేసే అభ్య‌ర్థ‌న‌లు;
e) ఇత‌ర ప్ర‌భుత్వాధికారి (ప్రభుత్వాధికారుల) ప‌రిధిలోని అంశాల‌కు సంబంధించిన స‌మాచారం; లేదా
f) ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఇమ్మని అడగడం.

6. పిఎంఒ కు సంబంధించిన స‌మాచారం, ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డి ఉన్న అంశాల‌కు సంబంధించిన స‌మాచారం అంతా “స‌మాచార హ‌క్కు” శీర్షిక కింద పిఎంఒ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ద‌ర‌ఖాస్తుదారులు ఆర్ టిఐ కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు ఆ వెబ్ సైట్ లోని స‌మాచారాన్ని సంద‌ర్శించ‌డం వ‌ల్ల ఏ అంశాలు ప‌రిశీల‌నార్హం అన్న దానిపై అవ‌గాహ‌న క‌లుగుతుంది.

 

విద్యాహక్కు చట్టం- 2009

పిల్లలు ఏ దేశానికైనా అతి ఉన్నతమైన వనరులు. వీరి భుజస్కంధాలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన భవిష్యత్తు ప్రతిక్షణం దివ్యకాంతులవలే వెలగాలంటే వారికి నాణ్యమైన విద్య ఎంతో అవసరం. దీన్ని గుర్తించిన పెద్దలు 1950, జనవరి 26 నుంచి అమలు పర్చిన రాజ్యాంగంలో అవసరమైన చట్టాలు రూపొందించారు. 
                        రాజ్యాంగం 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలను ఆదేశిక సూత్రాలు అంటారు. దీనిలో 41వ నిబంధన విద్య, 45వ నిబంధన ఉచిత, నిర్బంధ విద్య, 45వ నిబంధన ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యాభివృద్ధి, దీనికి తోడు ప్రాథమిక హక్కుల్లో భాగంగా 29వ, 30వ అధికరణలు మైనారిటీల విద్యాహక్కును తెలియజేస్తున్నాయి. 
            దేశం స్వాతంత్య్రం పొందిన దాదాపు అరవై ఏండ్లకు దేశ చరిత్రలో విద్యకి సంబంధించిన కీలక చట్టం అమల్లోకి వచ్చింది. అదే విద్యాహక్కు చట్టం- 2009.
            యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009, ఆగస్టు 26న విద్యాహక్కు బిల్లు ఆమోదం పొందింది. 2009, ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సంతకాలతో గెజిట్ రూపంలో ఆవిర్భవించింది. ఈ బిల్లు బాలల మౌలిక హక్కు (అధికరణ 21)లో సవరణ చేయడంతో రూపొందింది. దీన్నే 21A అధికరణ అంటారు.
             
రాజ్యాంగంలో ఈ సవరణను 86వ సవరణగా పిలుస్తారు. ఈ బిల్లు 2010, ఏప్రిల్ 1 నుంచి పూర్తి ప్రభావంతో చట్టబద్ధమై అమల్లోకి వచ్చింది. విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం.
               విద్యాహక్కు చట్టం- 2009 లేదా రైట్ టు ఎడ్యుకేషన్- 2009 (ఆర్టీఈ-2009) సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టాలవలే ఇది అమలవుతుంది. ఎలాంటి రుసుము లేకుండా (ఉచితంగా) 6 నుంచి 14 ఏండ్ల వయస్సుగల బాలలందరూ తప్పనిసరిగా (నిర్బంధంగా) పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాల మీద ఉంటుంది.
           
  పాఠశాలల్లో చేరని లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించడం విద్యాహక్కు చట్టం ముఖ్య ఉద్దేశం. పాఠశాల నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వ పాఠశాల చదువులకు దూరంగా ఉన్న బాలబాలికలందరినీ గుర్తించి పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాలి.
                            ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించడానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25 శాతం సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి. ఈ చట్టంలో 7 అధ్యాయాలు (38 సెక్షన్లు), ఒక షెడ్యూల్ ఉన్నాయి. 

1వ అధ్యాయం


సెక్షన్ 1
-పార్లమెంట్ చేసిన ఈ దిగువ చట్టం-2009, ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొందింది. 
-ఈ చట్టాన్ని ఉచిత, నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టం, 2009, ఆగస్టు అని కూడా పిలువవచ్చు.
-ఒక్క జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి తప్ప ఇది దేశమంతటికీ వర్తిస్తుంది.
-కేంద్రప్రభుత్వం అధికారిక రాజపత్రంలో ప్రకటించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.


సెక్షన్-2
-ప్రభుత్వం (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) క్యాపిటేషన్ రుసుము (బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో ఇచ్చే చందా, విరాళం, చెల్లింపులు మొదలైనవి), బాలలు (6 నుంచి 14 ఏండ్ల వయస్సుగల పిల్లలు), ప్రాథమిక విద్య (1 నుంచి 8వ తరగతి), స్థానిక ప్రభుత్వం (బడి మీద పాలనకు సంబంధించి అధికారాలు కలిగి ఉన్న నగర పాలక సంస్థ లేదా నగర పాలక సంఘం లేదా జిల్లా పరిషత్ లేదా నగర పంచాయతీ లేదా పంచాయతీ లేదా ఏ ఇతర పేర్లతో పిలిచే సంస్థలు), బడి (ప్రాథమిక విద్యతో గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా స్థానిక బడులు, ప్రైవేటు బడులు, ఎయిడెడ్ బడులు, ప్రత్యేక వర్గీకరణకు చెందిన బడులు) పదాల నిర్వచనాలు.

 

2వ అధ్యాయం


సెక్షన్-3
-6 నుంచి 14ఏండ్లు గల పిల్లలందరికీ పరిసర ప్రాంత పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసేవరకు ఉచిత, నిర్బంధ హక్కు ఉంటుంది.
సెక్షన్-4
-6 ఏండ్లు నిండిన పిల్లలను స్కూల్‌లో చేర్చకపోయినా లేదా చేర్చిన తర్వాత ప్రాథమిక విద్య పూర్తిచేయలేకపోయినా వారిని వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
సెక్షన్-5
-వేరే స్కూల్‌లో ప్రవేశం పొందడానికి అప్పటివరకు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్‌చార్జి వెంటనే బదిలీ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. బదిలీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో ఆలస్యమైతే ప్రవేశం నిరాకరించడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఇట్టి పరిస్థితుల్లో కారకులైన వారిపై (ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్‌చార్జి) ఉద్యోగపరమైన చర్యలు తీసుకుంటారు.

 

3వ అధ్యాయం


సెక్షన్-6
-ఈ చట్టం అమలు నుంచి 3 ఏండ్లలోపు బడిలేని చోట బడిని స్థాపించాలి.
సెక్షన్-7
-ఈ చట్టంలో పేర్కొన్న నియమాలను పూర్తిచేయడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాధ్యులవుతాయి.
సెక్షన్-8
-సంబంధిత ప్రభుత్వాలు పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందజేస్తాయి.
సెక్షన్-9
-ప్రతి స్థానిక ప్రభుత్వం పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యని అందజేస్తాయి.
సెక్షన్-10
-తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలకు సమీప బడిలో ప్రవేశం కల్పిస్తారు.
సెక్షన్-11
-3 ఏండ్ల వయస్సుగల పిల్లలను ప్రాథమిక విద్యలో ప్రవేశం కోసం (6 ఏండ్లు నిండేవరకు) సంసిద్ధులను చేయడానికి పూర్వ బాల్యపు సంరక్షణ కేంద్రాల్లో (ఈసీఈ) చేర్పించే బాధ్యత సంబంధిత ప్రభుత్వాలదవుతుంది.

 

4వ అధ్యాయం


సెక్షన్-12
-ఈ చట్టంలో పేర్కొన్న పాఠశాలలు పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమూహాలకు చెందిన పిల్లలకు ఒకటో తరగతిలోని విద్యార్థుల సంఖ్యలో 25 శాతం ఇచ్చి ప్రాథమిక విద్యను పూర్తిచేసే వరకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి.
సెక్షన్-13
-పిల్లల ప్రవేశానికి ఎలాంటి రుసుము (క్యాపిటేషన్ ఫీజు) వసూలు చేయకూడదు. ఎంపిక పరీక్షలు నిర్వహించకూడదు. 
-గమనిక: క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే దానికి పదిరెట్లు జరిమానాకు శిక్షార్హులు. అదే విధంగా పిల్లలను ఎంపిక విధానానికి గురిచేస్తే మొదటిసారి తప్పునకు రూ. 25,000, ఆ తర్వాత ప్రతిసారి తప్పునకు రూ. 50,000 జరిమానా విధిస్తారు.
సెక్షన్-14
-ప్రాథమిక విద్యలో ప్రవేశాల కోసం పిల్లల జన్మ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించాలి. 
-గమనిక: పిల్లల వయస్సుకి సంబంధించి ధ్రువీకరణపత్రంలేని సందర్భంలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు.
సెక్షన్-15
-విద్యా ఏడాది ప్రారంభ తేదీ నుంచి సిఫారసు చేసిన గడువు పెంచినకాలంలో పిల్లలను పాఠశాలలో చేర్చుకోవాలి.
సెక్షన్-16
-పాఠశాలలో ప్రవేశం పొందిన పిల్లలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్లీ కొనసాగించకూడదు. బడి నుంచి తీసివేయకూడదు.
సెక్షన్-17
-పిల్లలను శారీరక శిక్షకు, మానసిక వేధింపులకు గురిచేయకూడదు.
సెక్షన్-18
-గుర్తింపు లేకుండా స్కూళ్లు నిర్వహించడం లేదా స్థాపించకూడదు. 
-గమనిక: గుర్తింపులేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై రూ. లక్ష జరిమానా విధిస్తారు. అప్పటికీ మారని పక్షంలో జరిమానా విధించిన రోజు నుంచి ప్రతిరోజూ రూ. 10 వేల జరిమానా విధిస్తారు.
సెక్షన్-19
-షెడ్యూల్‌లో పేర్కొన్న నియమాలు, ప్రామాణికాలు పూర్తిచేయకుండా సెక్షన్-18 కింద ఏ పాఠశాలను ఏర్పాటుచేయకూడదు. గుర్తింపును ఇవ్వకూడదు.
సెక్షన్-20
-కేంద్రప్రభుత్వం, విజ్ఞప్తి ద్వారా, షెడ్యూల్‌లో ఏదైనా ప్రామాణికాన్ని జోడించే లేదా తీసివేసే పూర్తి హక్కులు కలిగి ఉంటుంది.
సెక్షన్-21
-ఎలాంటి ఆర్థిక సహాయం పొందని పాఠశాలలు (ప్రైవేట్) తప్ప మిగతా అన్ని రకాల పాఠశాలలు స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో, ఆ పాఠశాలలో చదువుతున్న బాలల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, ఉపాధ్యాయులతో పాఠశాల యాజమాన్య సంఘాన్ని (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ) ఏర్పాటు చేయాలి.
సెక్షన్-22
-ఈ సెక్షన్ ప్రకారం ఏర్పాటైన ప్రతి పాఠశాల ఎస్‌ఎంసీ సిఫారసు చేసిన విధంగా నడుచుకోవాలి.
సెక్షన్-23
-కేంద్రప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకడమిక్ సంస్థ నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్న ఏ వ్యక్తి అయినా ఉపాధ్యాయుడిగా నియామకానికి అర్హులు (ఉదా: టెట్).
సెక్షన్-24
-ఈ సెక్షన్ ఆధారంగా నియామకమైన ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరుకావాలి. పాఠ్యాంశాలను పూర్తిచేయాలి. పిల్లల సామర్థ్యాన్ని అంచనావేసి దానికనుగుణంగా అవసరమైతే అదనపు బోధన అందించాలి.

 

సమాచార హక్కు చట్టం పై అవగాహన ఉ౦దా? 

సమాచర హాక్కు దరఖాస్తు చేసుకొని 30 రోజులు గడిచిన సమాచారం ఇవ్వకపోతే ఏమి చేయాలి?

సమాచార హక్కు చట్టం-2005 లోని సెక్షన్ 6 మరియు 7 ల గురించి తెలుసుకుందాం

 సమాచారం హక్కు దరఖాస్తు ఎలా రాయాలి..? 

RTI ACT 2005 సమాచార హక్కు చట్టం లోని కొన్ని సెక్షన్స్ గురించి తెసుకోండి

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4,5 ల గురించి తెలుసుకొందాం