ఏ.పి.టి.యఫ్ పతాక గీతం
ఎగురవేయ్! ఎగురవేయ్!
ఇది మన జెండా!
జ్ఞాన క్రాంతి శాంతికాంతి
జగముల నిండా ||ఎగురవెయ్||
మనలకించపరచనెంచు మలినాత్ములు బెదరగా
మనల చీల్చజూచునట్టి విచ్ఛిన్నకులదరగా
బెదరింపులు, కుతంత్రాలు బెదరి చెదరి పారగా
ఉపాధ్యాయ సంఘశక్తి ఉర్వియంత ప్రాకగా ||ఎగురవెయ్||
జీతాలు, జీవితాల పోరు మాపివేయగా
హక్కులకూ, బాధ్యతలకు సఖ్యత సాధించగా
అక్షరాస్యతా వ్యాప్తికి దీక్షబూని సాగగా
జాతి జ్యోతి వెలిగించి నీతి జగతి నిలుపగా ||ఎగురవేయ్||
సంఘర్షణ, సంగ్రామం నిఘంటువుల జేరగా
విజ్ఞానపు వెలుగుపూలు విశ్వమంత పూయగా
సమభావం పునాదిగా శాంతి జగతి నిండగా
జగమంతా నందనమై ఆనందం పండగా ||ఎగురవెయ్||
జెండా గౌరవమె నీదు స్వీయ గౌరవమ్ముగా
వృత్తిభక్తి, సంఘశక్తి మన జెండా కండగా
సమైక్యతా కార్యదీక్ష మనసు నిండ నిండగా
నిఖిల ఉపాధ్యాయ జగతి నిర్భీతిగ నిలువగా ||ఎగురవెయ్||
- సమతారావు