బెల్లంకొండ, గుంటూరు జిల్లాలోని ఒక గ్రామము మరియు అదే పేరుగల ఒక మండలము. ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 16 కి. మీ. దూరంలో ఉంది  సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో వున్న ఒక పల్లెటూరు.

                                వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. కొండవీటి రెడ్డిరాజులు నిర్మించిన కోట ఇక్కడి ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు కోట లోని ముఖ్యాంశాలు. 

                                     1511 లో శ్రీ కృష్ణదేవరాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది.

     calligraphic line animation

    1789 లో "బెల్లంకొండ యొక్క తూర్పు దృశ్యం" C. మాకేంజీచే స్కెచ్

                            సెప్టెంబరు 1788 లో కోలిన్ మాకేంజీ (1754-1821) వారి చేత పూర్వపు స్కెచ్ నుండి 21 ఆగష్టు 1816. C. ఇగ్నాషియో, (21 వ ఆగస్ట్ 1816)

                  ఈ కోట 14 వ శతాబ్దంలో కోందవిడు యొక్క రెడ్డి రాజుల చేత నిర్మించబడింది. బెల్లంకొండ (బిలం కొండ ) ఆంధ్రప్రదేశ్ లో సముద్ర మట్టానికి 1,569 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ కోట సుమారు ఒక చదరపు మైలు పొడవును కలిగి ఉన్న ఒక సమమైన త్రిభుజం ఆకారంలో ఉంటుంది, ఇది కొండ యొక్క ఎత్తులో ఉన్న భాగాలను దక్షిణ-తూర్పు మరియు నార్త్-వెస్ట్ కోణాలలో బురుజులతో కలిపే సింగిల్ రాయి గోడను కలిగి ఉంటుంది.  కోట యొక్క ప్రారంభ చరిత్ర అస్పష్టంగా ఉంది, అయితే, కోండవిడ్ యొక్క రెడ్డి రాజులు దీనిని నిర్మించారు. 1482 లో వారి అధికారం గడిచిన తరువాత అది బహుశా ఒరిస్సా రాజుల చేతుల్లోకి వచ్చింది, తరువాత విజయనగర రాజులు, చివరకు 1578 లో ముస్లింలు చేతుల్లోకి వచ్చిందిపద్దెనిమిదవ శతాబ్దం ముగింపులో ఇంగ్లీష్ వారు మట్టి గుడిసెలలో కొండ దిగువన ఉన్న కొన్ని దళాలను నివాసం ఉంచారు.

 

         

       ప్రోలయ వేమారెడ్డి                       కులీ కుతుబ్ షా                                        ఔరంగజేబు

                             క్రీస్తుశకం 13వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ కోటను నిర్మించడం జరిగింది మొదటి రెడ్డి రాజైన ప్రోలయవేమారెడ్డి సుమారు 88 గిరి దుర్గాలను నిర్మించాడు అని చరిత్ర చెబుతోంది గిరిదుర్గాలలో మీద నిర్మించిన కోటలు ఎలాంటి దండయాత్ర అయినా సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.అలాంటి గిరి దుర్గమే  ఈ బెల్లంకొండ కోట

                        ఈ బెల్లంకొండ కోట మొదట రెడ్డి రాజులు తరువాత విజయనగర రాజులు, ఒరిస్సా గజపతులు, గోల్కొండ కుతుబ్ షాహిలు, మొగలులు చివరగా బ్రిటిష్ వారి పాలనలో ఉండటం జరిగింది.

                                        ఈ బెల్లంకొండ కోటను రెడ్డి రాజులు సుమారు వంద సంవత్సరాలు పరిపాలించారు రాచవేమారెడ్డి మరణం తర్వాత కృష్ణానదికి దక్షిణాన ఉన్న భూభాగం మొత్తం రెండవ దేవ రాయలు విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది.

                          క్రీస్తుశకం 1446 సంవత్సరంలో రెండవ దేవరాయలు మరణం తర్వాత గజపతుల వంశం మొదటి రాజయిన కపిలేశ్వర గజపతి ఈ కోట జయించి తనకు నమ్మకంగా పనిచేసే సైనికాధికారి గణదేవ ని బెల్లంకొండ, కొండవీడు కోట లకు పరిపాలనాధికారిగా నియమించడం జరిగింది.

                                 తరువాతి కాలంలో ప్రతాపరుద్ర గజపతి కటకం నుండి పరిపాలిస్తూ కొండవీడు బెల్లంకొండ కోటల పరిపాలనను తన కుమారుడైన వీరభద్ర గజపతి కి అప్పగించడం జరిగింది.ఇది 1515 వరకు గజపతుల పాలనలోనే ఉంది.

                               క్రీస్తు శకం 1515 లో శ్రీ కృష్ణ దేవరాయలు తన దండ యాత్రలో భాగంగా ఈ బెల్లంకొండ కోటను ముట్టడించారు ఈ కోటను జయించటానికి శ్రీకృష్ణదేవరాయలు కి సుమారు 6 నెలల సమయం పట్టింది దీనిని బట్టి అప్పట్లో అది ఎంతటి పటిష్టమైన కోటో మనం అంచనా వేయవచ్చు బెల్లంకొండ కోట స్వాధీనంతరం శ్రీకృష్ణదేవరాయలు కొండవీటి పై దాడి చేసి వీరభద్ర గజపతిని  బందీగా పట్టుకున్నాడు

                                    ఈ దండయాత్రలో విజయానంతరం శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నుండి కటకంపై యుద్ధానికి బయలుదేరాడు అయితే ఓరుగల్లు కోట అధిపతి సీతాపతి గజపతులు కి సాయంగా వచ్చి సింహాచలం వద్ద శ్రీకృష్ణదేవరాయల ని అడ్డగిస్తాడు అటు ఓరుగల్లు సైన్యాన్ని , ఇటుగజపతుల సైన్యాన్ని ఒకేసారి ఎదుర్కోవటం శ్రీకృష్ణదేవరాయల కష్ట సాధ్యం అవుతుంద కానీ ఆ సమయంలో ప్రతాపరుద్ర గజపతి తన కుమారుడైన వీరభద్ర గజపతి మరణ వార్త విని కృష్ణదేవరాయల తో సంధికి సిద్ధపడి తన కుమార్తె అయిన జగన్మోహిని ని శ్రీ కృష్ణదేవ రాయలు కు ఇచ్చి వివాహం చేసి సంధి కుదుర్చుకోవడం జరిగింది

                           సీతాపతి  పరాక్రమం నచ్చో మరి ఏ ఇతర కారణం వల్లనో కానీ బెల్లంకొండ, వరంగల్ ,ఖమ్మం కోటల పై అతనిని 1518లో రాజు గా నియమించడం జరిగింది. కానీ ఈ సీతాపతికి తన సరిహద్దు రాజయిన గోల్కొండ కుతుబ్ షా తో నిరంతర సరిహద్దు గొడవలు జరుగుతూనే ఉండేవి

                      క్రీస్తుశకం 1529 వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల మరణం అనంతరం విజయనగర సామ్రాజ్యం కొంతకాలం అల్లకల్లోలంగా తయారయింది .ఈ సమయంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా సీతాపతి పై దాడికి వచ్చి ఊహించని విధంగా ఓరుగల్లుపై కాకుండా బెల్లంకొండ పై దాడి చేయడం జరిగింది .ఈ దుర్గం అభేద్యమైనది అయినందువల్ల కొండకు అన్నివైపులా నిప్పు పెట్టి సుమారు ఐదు నెలల అనంతరం బెల్లంకొండ ను స్వాధీనం చేసుకున్నాడు

          సుల్తాన్ కులీ కుతుబ్ షా  బెల్లంకొండ ను జయించిన తర్వాత 1530లో తన అధికారి అయినటువంటి  జియావుల్ ఖాన్   ను పరిపాలనాధికారిగా నియమించడం జరిగిందికానీ విజయనగర సామ్రాజ్యంలో పరిస్థితులు చక్కబడిన తరువాత అచ్యుతరాయలు బెల్లంకొండను తిరిగి ఆక్రమించి "రామయ్య భాస్కరుడు" అనే అధికారిని పాలకుడుగా నియమించడం జరిగింది..

            తళ్లి కోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం అనంతరం బెల్లంకొండ కోట మరల కుతుబ్షాహీల పాలన క్రింది కి వెళ్ళటం 1627 వ సంవత్సరం వరకు వారి ఆధీనంలోనే ఉండటం జరిగింది

              క్రీస్తు శకం 1687 లో ఔరంగజేబు గోల్కొండ పై దండయాత్ర చేసి తానీషాను ఓడించి వారి సామ్రాజ్యాన్ని మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది . మొగలు ఆధీనంలో ఉన్న బెల్లంకొండ కోటను వారి కింద జమిందారుగా ఉన్నటువంటి మల్రాజు వెంకట నరసింహారావు 1707 నుండి 1750 వరకు ఈ కోట నుండి పరిపాలన సాగించడం జరిగింది.

                    ఈ సంస్థాన పరిపాలన పెద్ద వెంకట గుండా రావు తరువాత చిన్న వెంకట గుండా రావు గారి పాలనలో బెల్లంకొండ నుండి నరసరావుపేట కు మార్చడం జరిగింది. తదనంతరం ఈ కోట బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో మద్రాస్ ప్రెసిడెన్సీ కి రావడం జరిగింది.

         horizontal design element     

                       పెమ్మసాని నాయకులు ముందు బెల్లంకొండ కోట పాలకులుగా ఆ పిమ్మట గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన గండికోట యుద్ధంతో వీరి రాజ్యం పతనం అయింది.

                            ముఖ్యముగా విజయనగర సామ్రాజ్య కాలములో గండికోట పాలకులుగా ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండకు చెందిన ముసునూర్ల గోత్రీకులు.1424వ సంవత్సరములో కాకతీయ సామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరు విజయనగరమునకు తరలిపోయి ఆ తరువాత రెండు శతాబ్దములు దక్షిణభారతదేశమును హిందూమతమును రక్షించుటకు పాటుపడిరి.

         horizontal design element

                                        నరసారావుపేట సంస్థానాధీశులు విరియాల గోత్ర పద్మనాయక వెలమలు. వీరి ఇంటి పేరు మల్రాజు వారు. క్రీ.శ. 1234 నాటి పమ్మి దాన శాసనం విరియాల మల్రాజు.. కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి మహాసామంతుడని చెబుతున్నది. ఈ మల్రాజు వంశీయులే మల్రాజు ఇంటి పేరుగల పద్మనాయక ప్రభువులయ్యారు. ఈ వంశానికి చెందిన గుండయ, గుండారాయణం, గుండారావు వారు, కొండరాజు, కొండమ నాయుడు, కొండారావు అనే పేర్లు సంస్థాన చరిత్రలో ఎక్కువగా కనిపిస్తాయి. గుంటూరు వంకిదేవరను సంహరించి మల్రాజు వారు కాకతీయులకు సామంతులయ్యారు. 

                                   కాకతీయ సామ్రాజ్య పతనానంతరం అద్దంకి, కొండవీడు రెడ్డి రాజ్యాలు ప్రాబల్యంలో ఉన్నప్పుడు వీరు రాచకొండ ప్రభువుల కొల్లాపురం ప్రాంతాన్ని ఆశ్రయించారు. రాచకొండ రాజులు కొండవీటిని జయించిన తర్వాత తిరిగి గుంటూరు మండలానికి వచ్చి బెల్లంకొండ, వినుకొండ దుర్గపాలకులుగా స్థిరపడ్డారు.రేచర్ల సింగభూపాలుని (క్రీ.శ. 1410-1475) కాలంలో వీరు బెల్లంకొండ పాలకులుగా ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. మల్రాజు వారిని ఏడుకొండల ప్రభువులు అంటారు. బెల్లంకొండ, సింగరకొండ, నందికొండ, కొండవీటి కొండ, వినుకొండ, గుత్తికొండ, కోటప్పకొండ.. ఇవే ఆ ఏడు కొండలు. అగ్నిగుండాలలో వీరి కోట ఉండేది. దీనిని ఏలిన వారిలో మల్రాజు సూరయ్య ప్రధానమైన వాడు.

           horizontal design element

బెల్లంకొండ మండలం  కోళ్ళూరు నందు దొరికిన కోహినూర్ వజ్రం  చరిత్ర, విశేషాలు

                            

                 ప్రపంచంలో అత్యంత ప్రసిద్ది పొందిన,ప్రాచీనమైన వజ్రాలలో కోహినూర్ ఒకటి .ఇది 17వ శతాబ్ధంలో గుంటూరు జిల్లా,బెల్లంకొండ మండలం కోళ్ళూరు గ్రామంలో దొరికింది దీని అన్వేషణ చరిత్ర గురించి అనేక వృత్తాంతాలువున్నాయి.

            “సింధ్ బాద్” అను యాత్రా చరిత్ర పుస్తకమునందు ఇది కొండలపై అత్యంత ప్రమాదకరమైన పాములు ఉండు ప్రదేశంలో దొరికిందని రాసిఉంది.

                 కృష్ణానది తీరంలో ఈ వజ్రాలను ఎల సేకరించేవారో పాశ్చాత్య పర్యాటక పరిశోధకులు మార్కోపోలో , నికోలోడీకాంటీ వంటి వారి రచనల ద్వారా  మనం అధ్యయనం చేయవచ్చు.

                    ఆ కాలంలో కొండల చుట్టూ తెల్ల గ్రద్దలు పాములకొరకు అత్యధికంగా తిరుగుతూ ఉండేవి. అవి కొండ దిగువున పరిసర ప్రాంతాలలో ఏదేని మాంసం ఖండాలు కనిపించిన వాటిని సమీప కొడరాళ్ళపై తీసుకొనివచ్చి ముక్కలు ముక్కలుగా చేసి తింటూ ఉండేవి.

                     వజ్రాన్వేషణ చేయు వ్యక్తులు ఆ కొండరాళ్ళ దగ్గర  కాపు కాచి ఉండేవారు. గ్రద్దలు మాంసపు ఖండాలతో అక్కడీకి వచ్చి తినేటప్పుడు హఠాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ వాటిని పారద్రోలేవాళ్ళు. గ్రద్దలు వొదిలి వెళ్ళిన మాంసపు ముక్కలుకు అంటిన వజ్రాలను సేకరించేవారు.

           మార్కొపోలో వెనీస్ నుండి  మనదేశానికి 13 వ శతాబ్ధంలో  నికొలస్ డి కాంటీ  15వ శతాబ్ధంలో సందర్శించటం జరిగింది

                       కాంటీ పర్యటన వివరాలను 15వశతాబ్ధంలో హాక్లియట్ సొసైటీ పబ్లికేషన్ ద్వారా మనదేశంలో ప్రచురించటం జరిగింది. ఈ ప్రచురణ పుస్తకం నందు  కృష్ణాతీరంలో ,బెల్లంకొండ మండలం, కోళ్ళురు గ్రామం నందు విరివిగా లభించు వజ్రముల గురించి అక్కడ భయంకర పాముల వల్ల  సామాన్య మానవులు సంచరించలేని విధానం గురుంచి వివరించటం జరిగింది.

         కోళ్ళూరు సమీపమున గల కొండపైకి వజ్రాల సేకరణ వ్యక్తులు ఎక్కి  అక్కడ పశువులను/ జంతువులను వధించి  యంత్రాల సహాయంతో ఆ పరిసర ప్రాంతాలలో మాంస ఖండాలు వెదజల్లేవారు.  ఆహాము గా వాటిని సేకరించిన గ్రద్దలను అనుసరించి  వాటికి అంటి వున్న వజ్రాలను సేకరించేవారు. మార్కోపోలో  కూడా  బెల్లంకొండ పరిసర ప్రాంతాలలో వజ్రాల గురించి ప్రస్తావించటం జరిగింది.

             జీన్ బాప్టైజ్ టావెర్నర్ అనే ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి  విలువైన రాళ్ళకోసం  ఈ ప్రాంతాన్ని ఆరు సార్లు (1605-1689) సందర్శించటం జరిగిందని తెలియ జేశాడు.  పులిచింతలకు దక్షిణంగా బెల్లంకొండకు పశ్చిమాన  గల ఈ ప్రదేశంకు గోల్కొండ నుండి ఏడు రోజులు ప్రయాణం చేసి చేరుకున్నట్లు తన పర్యటన పుస్తకంలో  వెలువరించారు.

          టావెర్నర్ కి ముందు వంద సంవత్సరాలకు పూర్వము నుండే కోళ్ళూరు ప్రాంత వజ్రాల గురించి  అనేక కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి . ఈ ప్రాంత రైతు ఒకరు భూమిని దున్నుతుండగా ఒక కాంతివంతమైన రాయి నాగలకి తగిలి తనకు దొరికింది.ఆ రైతు ఆ రాయి చాలా విలువైనదిగా భావించి గోల్కొండకు వెళ్ళీ అక్కడ వజ్రాల వ్యాపారులకు చూపించటం జరిగింది. అప్పటి నుండి ఇతర  వజ్రాల వ్యాపారులుఈ ప్రాంతాన్ని వజ్రాల అన్వేషణకోసం సందర్శించటం  జరుగుతుంది .        

       అప్పటి ఆరైతుకు దొరికిన వజ్రం 25కేరెట్స్ ఉండగా  10నుండి 40 కేరెట్స్ బరువుగల  ఎన్నో వజ్రాలుఈ ప్రాంతంలో లభ్యమైనాయి.

             మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన సైనికాధికారి మీర్ జమ్లాకి  పదివేలమంది సైన్యానికి బాధ్యత అప్ప్గించి గోల్కొండ కోటనందు ఉంఛటం జరిగింది. గోల్కొండ కోటలో అతి పెద్ద వజ్రం ను కనుగొన్న మీర్ జమ్లా ఆవజ్రాన్ని ఔరంగజేబుకి కానుకగా ఇవ్వటం జరిగింది .

                 ఔరంగజేబు ఆ వజ్రానికి  కోహినూర్గా నామకరణం చేశాడని ప్రతీతి. టావెర్నర్ కధనం ప్రకారం సుమారు అరవై వేల మంది వజ్రాలకోసం కోళ్ళూరును అప్పట్లోనే సందర్శించటం జరిగిందని వెలువరించాడు.

              నవంబర్2,1665 వ సంవత్సరం నందు టావెర్నర్  ఔరంగజేబును కలిసి కోహినూర్ వజ్రంను తిలకించటం జరిగింది. తరువాత కోహినూర్ ను నాదిర్ షా చేజిక్కించుకున్నాడు.ఆ తరువాత అనేక పరిణామాల మధ్య  చివరకు బ్రిటీష్ వారి చేతికి వెళ్ళింది,కోహినూర్  మెరుగులు దిద్దే క్రమంలో 218 కేరెట్ల నుండి ఇప్పుడు 185.5 కేరెట్ల వరకు తగ్గించబడినది.

                            పిట్ లేక రీజెంట్ అనే వజ్రంకూడా ఇదే ప్రదేశంలో దొరికిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వజ్రాల ఘని నిజాంరాజులు, కొండపల్లి రాజులు, తదనంతరం బ్రిటీష్ వారి అధీనంలో ఉంది.  రీజెంట్ డైమండ్ గురించి ఒక ఆసక్తికర కధనం ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ పని చేయు ఒక పని వానికి   ఈ వజ్రం దొరకగా అతడు తనకు తాను గాయపరుచుకొని, ఆ గాయంలో వజ్రం కనపడకుండా దాచి బయటకు తీసుకెళ్ళాడని నానుడి. తరువాత ఇది అనేక చేతులు మారి మద్రాస్ గవర్నర్ పిట్ కి  చేరగా అతడు దీనిని యూరప్ చేర్చాడు. రిజెంట్ డైమండ్గా పిలువ బడుతున్న  ఈ వజ్రం  ప్రస్తుతం ఫ్రెంచి రాజుల జ్యూయలరీ ప్యాలెస్ నందు ఉన్నది.

                                                            సేకరణ ,అనువాదం  -  బొర్రా శ్రీనివాస్.

 animated-line-image-0467

             కోహినూర్ వజ్రం  చరిత్ర, విశేషాలు  - మరికొంత సమాచారము

                                    భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరుచాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.

                                       బాబర్ తన కుమారుడు, సామ్రాజ్యవారసుడూ అయిన హుమాయున్‌కి ఇచ్చారు. హుమాయున్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసినా హుమాయున్ అతనిపై ఓటమిచెందారు. హుమాయున్ రాజ్యాన్ని పరిమితం చేసుకని, ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు. అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవు రాజ్యం దగ్గరలో హుమయూన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు. అందుకోసం

                                    బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీపాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై 'బాబర్‌ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్‌ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ - ఇ- నూర్‌ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.

భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు

                      క్రీ. శ. 1913 (1813?)వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.

                   తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

  Diamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFsDiamond Prism GIF - Diamond Prism Spin GIFs

                  వన్నాయపాలెం , బెల్లంకొండ మండలం

             పూర్వము ఈ గ్రామము వన్నయ్య అనే యాదవ వంశస్థుడుచే నిర్మితమైనదని ఇక్కడి జనం నానుడి 

                      నరసరావుపేట జమిందారు గుండా రావు గారి సంస్థానంనందు కూచిపూడి బ్రాహ్మణులు  పచ్చికుండపై నాట్యం చేసి వారిని మెప్పించడం వలన " ప్రతాపగిరి సుబ్బన్న "అనే అతనికి దీనిని అగ్రహారంగా ఇవ్వడం జరిగింది.  దీనిని 1945లో ఈ అగ్రహారం ప్రభుత్వం వారు శేరిగా తీసుకోవడం జరిగింది .ఈ గ్రామం ప్రక్కన గల బెల్లంకొండ కొండపై మల్లేశ్వర స్వామి దేవాలయం కలదు

         ఇక్కడ ఆషాడ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి నాడు పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది

        

 

         animated calligraphic line

Bodanam vajra narasimha....in Bellamkonda mandal

               History of Lord  vajra Narasimha....

               one fine day king yadava working in his form..suddenly he saw one great power ..he cant expect what is that power until one hour...later he became normal and went to see ..Then he found one Diamond appeared in one man with full of light..He is the Lord Narasimha.Lord told to king yadava...bulit one temple for me...and invite all devotiees for prayes...

                  Then lord disappear from there....after some days yadava built one temple on the hill, near to bodanam village. Now also it is there...and it is a great place to see the lord and great natural scenarie...

               one great scentiment is there for the devotiee of Lord Narasimha....

one bad news about this temple is, now it will going to vanish due to Pulichintala water Project..

        animated calligraphic line

                బెల్లంకొండ మండలం  కేతవరం

 

   బెల్లంకొండ మండలంలోని గ్రామాల జనాభా, అక్షరాస్యత  వివరాలు

                   

 

బెల్లంకొండ కోట  మరియు

 పరిసర ప్రదేశాల దృశ్యాలు 

కోళ్ళూరు లో వజ్రాల వేట

బెల్లంకొండ కోట - చరిత్ర

కోహినూరు వజ్రం - చరిత్ర లో ఏం జరిగింది

కోళ్ళూరు..అక్కడ వర్షం పడితే

లక్ష్మీ నరసింహ స్వామి - కేతవరం కొండపై

కోహినూర్ గురించిన ఆశ్చర్యకర చరిత్ర

బెల్లంకొండ లో దేవాలయాల చరిత్ర

బెల్లంకొండ కోట దృశ్యాలు

కోళ్ళూరు - కోహినూరు వజ్రం  చరిత్ర

లక్ష్మీ నరసింహ స్వామి - కేతవరం చరిత్ర

కోహినూర్ కు ఆ పేరు పెట్టింది ఎవరు? 

బెల్లంకొండ మండలంలో కోళ్ళూరు ప్రాంతం  దృశ్యం