ap dsc pgt tgt exams starts from tomorrow online exam details and precautions

AP DSC 2018: ఏపీ డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థులకు సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ఏపీ డీఎస్సీ-2018 పరీక్షలు సోమవారం (డిసెంబ‌రు 24) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిసారిగా డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,902 పోస్టులకుగాను 6,08,159 అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్న విషయం తెలిసిందే. 


డీఎస్సీ పరీక్షలకు సంబంధించి తొలిదశలో స్కూల్‌ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, మ్యూజిక్, ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 24 నుంచి జనవరి 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 2,62,106 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇక రెండో దశలో.. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) పరీక్షలు జనవరి 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 3,46,053 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. 

పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 124 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీలో 113, ఒడిశాలో 3, తెలంగాణలో 4, బెంగళూరులో 2, చెన్నైలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం, కంప్యూటర్‌ పరీక్ష కేంద్రాలు తక్కువగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అంధులకు 50నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 536 మంది దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. వీరందరికీ సహాయకులు (స్క్రైబ్స్‌)ను కేటాయించారు. వీరు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరీక్షా కేంద్రాల్లోని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ఏపీ డీఎస్సీ-2018 పరీక్షలు సోమవారం (డిసెంబ‌రు 24) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిసారిగా డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,902 పోస్టులకుగాను 6,08,159 అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్న విషయం తెలిసిందే. 

డీఎస్సీ పరీక్షలకు సంబంధించి తొలిదశలో స్కూల్‌ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, మ్యూజిక్, ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 24 నుంచి జనవరి 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 2,62,106 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇక రెండో దశలో.. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) పరీక్షలు జనవరి 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 3,46,053 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. 
పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 124 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీలో 113, ఒడిశాలో 3, తెలంగాణలో 4, బెంగళూరులో 2, చెన్నైలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం, కంప్యూటర్‌ పరీక్ష కేంద్రాలు తక్కువగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అంధులకు 50నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 536 మంది దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. వీరందరికీ సహాయకులు (స్క్రైబ్స్‌)ను కేటాయించారు. వీరు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరీక్షా కేంద్రాల్లోని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. 

అభ్యర్థులకు ముఖ్య సూచనలు


✦ పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఎందుకంటే నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు. 
✦ పరీక్ష ప్రారంభమైన తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. 
✦ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే అభ్యర్థులు కంప్యూటర్‌లో లాగిన్‌ అయి పరీక్ష సూచనలు చదువుకోవచ్చు. 
✦ సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు

 

 

 

డి.యస్సీ 2018 నోటిఫికేషన్లోని ముఖ్యాంశాలు :

జీ.వో.యం.యస్.నెం. 67 పాఠశాల విద్య (పరీక్షలు) డిపార్టమెంట్ తేదీ 26-10-2018

                          ఈ జీవో ద్వారా ప్రభుత్వ, పంచాయితీరాజ్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ మరియు స్పెషల్ పాఠశాలలు (అంధ, మూగ చెవిటి) ఐ.టి.డి.ఎ, ఐ.టి.డి.ఎ. జిల్లాలు కాని నాన్ ఏజెన్సీ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలలు, శ్రీశైలం ఐ.టి.డి.ఎ అధీనంలోని చెంచుల ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్, భాషాపండితులు, పి.యి.టి.లు, సంగీత, క్రాఫ్ట్ మరియు ఆర్ట్ & డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ యివ్వబడింది.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు టెట్ కం టిఆర్టీ (TETCum-TRT) పరీక్ష నిర్వహింపబడుతుంది.

ఈ పరీక్ష 100 మార్కులకు వుంటుంది. 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలువుంటాయి. ఓ.సి.లు 60%, బి.సి.లు 50%,యస్.సి.లు, యస్. టి.లకు, దివ్యాంగులకు, ఎక్స్సర్వీస్ మెన్ లకు 40% అర్హత మార్కులు. అర్హత మార్కులు పొందినవారిని మాత్రమే నియామకాలకు పరిగణిస్తారు.

ఒకవేళ గత టెట్ పరీక్షల్లో అర్హత మార్కులు పొందివుంటే వారిని కూడా నియామకాలకు పరిగణిస్తారు.

ఈ పోస్టులకు క్రింది అర్హతలు వుండాలి.

         ఇంటర్మీడియట్ మరియు డి.యడ్ | డి.ఇయల్.యడ్ లేక NCTE గుర్తించిన తత్సమాన సర్టిఫికెట్లు. లేక కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు బి.యిడి.

సవరించిన NCTE నిబంధనలమేరకు సెకండరీ గ్రేడ్ టీచర్గా నియామకం పొందిన బి.యిడి అభ్యర్థులు రెండు సంవత్సరాలలోపు NCTE గుర్తించిన ఆరు నెలల బ్రిడ్జి కోర్సును విధిగా పూర్తి చేయాలి. 

పి.యి.టి.లు :

80 మార్కులకు టిఆర్టి వుంటుంది. 20 మార్కులకు టెట్ వెయిటేజీ. దీనిలో 50 మార్కులకు రాతపరీక్ష, 30 మార్కులకు శరీర దారుఢ్య పరీక్ష (Physical efficiency test) వుంటుంది.

సంగీత ఉపాధ్యాయులు :

100 మార్కులకు టిఆర్టి వుంటుంది. 70 మార్కులకు రాతపరీక్ష, 30 మార్కులకు నైపుణ్య పరీక్ష (Skill Test).

స్కూల్ అసిస్టెంట్లు :

80 మార్కులకు టిఆర్టి వుంటుంది. 20 చూర్కులకు టెట్ వెయిటేజీ

స్కూల్ అసిస్టెంటు (వ్యాయామ విద్య) : 

80 మార్కులకు టిఆర్టి వుంటుంది. 20 మార్కులు టెట్ వెయిటేజీ. 50 మార్కులకు రాతపరీక్ష. 30 మార్కులకు శరీర దారుడ్య పరీక్ష. (Physical Efficiency Test) వుంటుంది. 

భాషాపండితులు, క్రాఫ్ట్, ఆర్ట్ & డ్రాయింగ్ ఉపాధ్యాయులు :

   వీరికి 100 మార్కులకు టిఆర్టి వుంటుంది..

 స్పెషల్ టీచర్లు :

          నిర్దేశించబడిన అకడమిక్ అర్హతలతోబాటు సంబంధాలు స్పెషల్ ఎడ్యుకేషన్తో పోస్టును బట్టి డి.యడ్ / డి.ఇ.యల్.యడ్ లేక బి.యడ్ / బి.యల్, యడ్ అర్హతలు పొంది వుండాలి.

వీరు సాధారణ పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ / స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా అకడమిక్ అర్హతలున్న యెడల దరఖాస్తు చేసుకొనవచ్చును. అయితే నియామకం పొందిన తర్వాత NCTE గుర్తింపుపొందిన ఆరు నెలల స్పెషల్ ప్రోగ్రాంను చేయాలి.. 

వయోపరిమితి:

జులై ఒకటి 2018 నాటికి కనిష్ట వయస్సు 18 సంIIలు, గరిష్ట వయస్సు 44 సం||లు. యస్.సి., యస్.టి., బి.సి.లకు గరిష్ట వయస్సు 49 సం||లు. దివ్యాంగులకు గరిష్ట వయస్సు 54 సం||లు. మాజీ సైనికులకు వారు మిలటరీలో పనిచేసిన సర్వీసు కాలము మరియు 3 సం||లు అభ్యర్థి వయస్సు నుండి తగ్గించి గరిష్ట వయస్సును లెక్కిస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) :

నియామక పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహింపబడును.

ఈ ఉత్తర్వులో విద్యార్హతలు, సిలబస్, ఎంపిక విధానం, తదితర అంశాలు యివ్వబడినవి

horizontal design element

 జీవోయం.యస్.నెం. 68 పాఠశాల విద్య (పరీక్షలు) డిపార్టమెంట్ తేదీ 26-10-2018 .

        1) ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ లోని ప్రిన్సిపాల్, పి.జి.టి., టి.జి.టి. పోస్టులకు, 

       2). ఏ.పి. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పి.జి.టి., టి.జి.టి మరియు పి.యి.టి. పోస్టులకు 

       3), బి.సి. ఆశ్రమ పాఠశాలల్లోని పి.జి.టి. టి.జి.టి., పి.యి.టి. క్రాఫ్, ఆర్ట్ & మ్యూజిక్ పోస్టులలో నియామకానికి టిఆర్టీ (టీచర్ రిక్రూటిమెంట్ టెస్ట్) నిర్వహింపబడును.

ప్రిన్సిపాల్స్ కు 100 మార్కులకు రాతపరీక్ష, పి.జి.టి.లకు 100 శాతం రాతపరీక్ష, టి.జి.టిలకు 80 మార్కులకు రాతపరీక్ష మరియు 20 మార్కులకు టెట్ వెయిటేజీ, పి.యి.టి.లకు 50 మార్కులకు రాతపరీక్ష + 30 మార్కులకు శరీర దారుఢ్య పరీక్ష + 20 మార్కులకు టెట్ వెయిటేజీ, సంగీత ఉపాధ్యాయులకు 70 మార్కులకు రాత పరీక్ష మరియు 30 మార్కులకు నైపుణ్య పరీక్ష (Skill Test), క్రాఫ్ట్ & ఆర్ట్ టీచర్లకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహింపబడును.

ప్రిన్సిపాల్స్, టీ, జి.టి., పి. జి.టీలకు అదనంగా మరో పేపరు స్క్రీనింగ్ టెస్ట్ (English Language Proficiency Test) 100 మార్కులకు నిర్వహింపబడును. దీనిలో ఓ.సి / బి.సి.లు 60 మార్కులు, యస్.సి / యస్.టి. / పి. హెచ్ / మాజీ సైనికులు 50 మార్కులు కనీస అర్హత మార్కులుగా పొందాలి.

horizontal design element

 జీ.వో.యం.యస్.నెం. 70 పాఠశాల విద్య (పరీక్షలు) డిపార్టమెంట్ తేదీ 05-11-2018

           ఈ జీవో ప్రకారం తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ, ఒరియా, సంస్కృతం భాషాపండితులు మరియు స్కూల్ అసిస్టెంటు పోస్టుల నియానుకానికి ఆయా భాషలలో పోస్టుగ్రాడ్యుయేషన్ డీగ్రీ, మరియు సంబంధిత భాషలో బి, ఇది లేక పండిట్ ట్రైనింగ్ చేసినవారు కూడా నియామకానికి అర్హులని సవరణ ఉత్తర్వులు ఇవ్వడమైనది.

ఆదర్శ పాఠశాలలు బిసి గురుకుల సొసైటీలకు చెందిన జోనల్ పోస్టులు

                           రాష్ట్రస్థాయి పోస్టులు -

            ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ళు :-77

            బి.సి. గురుకుల ప్రిన్సిపాళ్ళు    :--12

           ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ళు      :- TGT 93  , PGT  60,  PET 22

ప్రభుత్వ/మండల/జిల్లా పరిషత్, మున్సిపల్/ఐటిడిఏ/నాన్ ఐటిడిఏ పాఠశాలల్లోని

 

DSC - 2018    Schedule

నవంబరు 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపు

1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ

1 నుంచి 12 వరకు హెల్ప్‌ డెస్క్‌ సర్వీసులు

19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక

17 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు

29 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌

డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాతపరీక్షలు

11న స్కూల్‌ అసిస్టెంట్స్‌(లాంగ్వేజెస్‌) రాతపరీక్షలు

12, 13 తేదీల్లో పీజీ టీచర్స్‌ రాతపరీక్ష

14, 26 తేదీల్లో పీజీ టీచర్స్‌, ప్రిన్సిపాళ్ల రాతపరీక్ష

17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ పరీక్షలు

27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ పరీక్ష

28 నుంచి 2019 జనవరి 2 వరకు ఎస్జీటీ పరీక్ష     

Notification School Education  |  Residential Schools

Information Bulletin School Education  |  Residential Schools

Payment Gate way

School Education Payment Gateway Click Here

Residential School Payment Gateway Click Here

Special Schools Payment Gateway Click Here

                                                    అర్హత, కేటగిరీకి తగిన టీచర్‌ పోస్టు ఖాళీగా ఉంటేనే సదరు జిల్లాకు దరఖాస్తుచేసుకునే అవకాశం ఉంటుంది. సదరు అభ్యర్థికి తగిన పోస్టులు లేకుంటే అసలు దరఖాస్తు ఆన్‌లైన్‌లో ఓపెన్‌ కాదు. అప్పుడు ఇతర జిల్లాను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో వివరణలు తీసుకునేందుకు పాఠశాల విద్యా కమిషనరేట్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ఏపీ మోడల్‌ స్కూల్స్‌-9603587533, బీసీ వెల్ఫేర్‌-9603576833, ఏపీఆర్‌ఈఐ సొసైటీ-9603570433, గవర్నమెంట్‌/జడ్పీ/ఎంపీపీ/మున్సిపల్‌ మరియు ట్రైబల్‌-9603578533, 9505619127, 9505853627. సాంకేతిక సమస్యల నివృత్తికి మరో రెండు హెల్ప్‌లైన్‌ నెంబర్లను (9121148061, 9121148062) అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు కీలకమైన సిలబస్ను కూడా వెబ్‌సైట్లో ఉంచారు.