సందేహాలు - సమాధానాలు (1 -25)

1.CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు?
CL వరుసగా 10 రోజులు పెట్టుకోవచ్చు


2.స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు?
ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.


3.మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇ0చుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా?
జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.


4.CCL ఒకేసారి వాడుకోవచ్చా?
మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు.1 ఇయర్ లో 10 రోజులకి మించి వాడుకోకూడదు


5."లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?
*1933 aplr రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.


6.ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు?
*రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లురావు.ఐతే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితి లలో మంజూరు చేయవచ్చు.

 

7.అప్రంటీస్ కాలంలో EOL వాడుకోవచ్చా?వాడుకుంటే ఇంక్రిమెంట్లు పోస్ట్ ఫోన్ అవుతాయా?

అర్హత లేదు. FR(బి)ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నత చదువులు, వైద్య కారణాలపై వినియోగించుకున్న EOL కాలం ఇంక్రిమెంట్లు కి పరిగణింపబడుతుంది.

 

8.డైస్ నాన్ కాలం పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతుందా?

FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, పెన్షన్ ప్రయోజనాలకు అర్హత గల సెలవుగా పరిగణించబడదు.

 

9.డైస్ నాన్ శిక్ష ను రద్దు లేదా మార్పు చేయించుకోవాలీ అంటే ఎవరికి అప్పీల్ చేసుకోవాలి?

ఉత్తర్వులు ఇచ్చిన 90 రోజులు లోగా అప్పిలేట్ అథారిటీ కి అప్పీల్ చేసుకోవాలి.

 

10 ZPPF లోన్ తిరిగి చెల్లించకుండా ఉండాలంటే ఉద్యోగికి ఎంత సర్వీసు ఉండాలి?

20 ఇయర్స్ సర్వీసు నిండితే లోన్ అమౌంట్ తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో మరియు ఇంటి కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయిన సందర్భంలో సరియైన పత్రాల ఆధారంగా 15 ఇయర్స్ సర్వీసు నిండిన ఉద్యోగి కూడా లోన్ తిరిగి చెల్లించకుండా ఉండవచ్చు.

 

11.ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో నుంచి మన అత్యవసరాలకు దాచుకున్న మొత్తంలో కొంత వెనక్కి లేదా అప్పుగా తీసుకవచ్చు కదా! జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ఇలా తీసు కోవడం వీలవుతుందా? పదవీ విరమణ, అత్యవసరాలకు సంబంధించి ఈ రెండింటిలో ఏది మెరుగైనది?

జవాబు:  దీర్ఘకాలిక అవసరాల కంటే తక్షణ అవసరాలు, కోరికలు, కలల కోసం ఖర్చు పెట్టాలని చూడటం మానవ బలహీనత. పదవీ విరమణ చేశాక పింఛను అత్యవసరం. పింఛను కోసం మొదలు పెట్టిన దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను మధ్యలో తీసుకోకూడదనే లక్ష్యంతో ఎన్‌పీఎస్‌ టైర్‌ 1 ఖాతాలో మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోకూడదనే నిబంధన విధించారు. ఇటీవల దీన్ని కొంత సడలించారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, గుండెపోటు, పక్షవాతం, ప్రమాదం వంటి ఆరోగ్య అవసరాలకు మన ఎన్‌పీఎస్‌ నిల్వలో 25శాతం వెనక్కి తీసుకోవచ్చు.ఎన్‌పీఎస్‌ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత ఈ సదుపాయం లభిస్తుంది. పదవీ విరమణ చేసేలోగా మూడుసార్లు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. పీపీఎఫ్‌లో వడ్డీ జనవరి నుంచి 7.6శాతం. ఎన్‌పీఎస్‌ టైర్‌-1 ఈక్విటీలో గత ఐదేళ్ల రాబడి 14శాతం వరకూ ఉంది.ఇందులో ప్రభుత్వ బాండ్‌ పథకంలో కూడా రాబడి 8.47% పైగానే ఉంది. సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, అదనంగా మరో రూ.50వేల పెట్టుబడి వరకూ ఎన్‌పీఎస్‌లో మదుపు చేసి, ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు. కాబట్టి, మీరు ఎన్‌పీఎస్‌ ఎంచుకోవచ్చు.


12.మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు?

జవాబు:  సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.


  13. FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా?

జవాబు:    FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.

 

14. నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల?

జవాబు: జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.

 

15. నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము. ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు?

జవాబు:  SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

 

16.: PF ఋణం ఎంత ఇస్తారు?తిరిగి ఎలా చెల్లించాలి?

జవాబు: PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.

 

17.ఒక టీచర్ 9 రోజులు APOSS పరీక్షల కోసం, మరియు 26 రోజులు SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం వేసవి సెలవులలో హాజరు అయ్యాడు.ఇపుడు ఆతనికి 35 ELs జమచేయబడతాయా?

జవాబు: మొత్తం కాలాన్ని కలిపి దామాషా ELs జమ చేయవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం జమ అయ్యే 6 రోజులు మీరు వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కంటే తగ్గిన యెడల పూర్తి సంపాధిత సెలవు 24 రోజులు జమ చేయబడుతుంది. ఇక్కడ 35 రోజులు పనిచేశాడు.14 రోజులే వేసవి సెలవులు ఉపయోగించుకొన్నందున అతనికి 24 రోజుల సంపాదిత సెలవు జమచేయవలసి ఉంటుంది.

 

18. ఒక టీచర్ తేదీ 1.1.1998 నాడు నియామకం అయ్యారు. 31.12.2017 నాటికి 20 సర్వీస్ పూర్తి అయింది. అయితే, ఈ ఇరవై ఏళ్ళ సర్వీస్లో 3 సంవత్సరాలు మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న జీతనష్టపు అసాధారణ సెలవు ఉంది. సదరు టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చా?

జవాబు:  తీసుకోరాదు. 20 ఏళ్ళ నెట్ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. పెన్షన్ రూల్ 43 ప్రకారం ఒక ఉద్యోగి/టీచర్ 20 సర్వీస్ పూర్తిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలచినప్పుడు.... Study కోసం పొందిన జీతనష్టపు అసాధారణ సెలవు (OCL Loss of Pay)ను మాత్రమే క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణిస్తారు. మెడికల్ గ్రౌండ్స్ లేదా ప్రైవేట్ అఫైర్స్ పొందిన OCL LP ని క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణించరు.అయితే... సూపెరాన్యుయేషన్ (58/60 Years) తో రిటైర్ అయినప్పుడు మాత్రం.... మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న Unlimited Period మరియు ప్రైవేట్ అఫైర్స్ తో పొందిన 36 నెలల OCL Loss of Pay ని పెన్షన్ కు క్వాలిఫయింగ్ సర్వీస్ గా లెక్కిస్తారు.

 

19.ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా?

జవాబు:చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
 

20.నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా?

జవాబు: జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.

 

21 మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా?

జవాబు: చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.

 

22.:సవతి పిల్లలు కి EHS వర్తిస్తుందా?

*జవాబు:జీఓ.174; తేదీ:1.11.2013 ప్రకారం సవతి పిల్లలు కూడా ehs ప్రయోజనాలు పొందవచ్చు.

 

23: దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి EHS వర్తిస్తుందా?

*జవాబు:జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి ఎవరో ఒకరికి మాత్రమే ehs వర్తిస్తుంది.

 

24.20 ఇయర్స్ కి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ ఎంత వస్తుంది?

*జవాబు: చివరి ములవేతనం లో 37.87% పెన్షన్ గా వస్తుంది.

 

25:సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి?

జవాబు:సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు

 

 

సందేహాలు - సమాధానాలు (26 - 50) :

26   నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??

జవాబు:   పెన్షన్ ను ఆదాయం గా చూపాలి.గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.

27:  నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??

జవాబు:   సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.

28   నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను.నేను ఆ ఉద్యోగం లో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా??

జవాబు:   జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టు లో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది.అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.

29  బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా??

జవాబు:  6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.

30   నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను??

జవాబు:   జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్,AAS స్కేల్స్ వాయిదా పడతాయి.3 ఇయర్స్ పైన జీత నష్టపు సెలవు కాలం పెన్షన్ కి అర్హ దాయక సర్వీస్ గా పరిగణింపబడదు.

 31  నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా??

జవాబు:    జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.

32   నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా??

జవాబు: అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

33   నేను సంక్రాంతి సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా??

జవాబు:  సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.

34   ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??

జవాబు:  మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.

35    ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs వస్తాయా??

జవాబు:   అవును..హాఫ్ పే లీవుకు ELs వస్తాయి..లాస్ ఆఫ్ పే పీరియడ్ కు రావు..

36    ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

జవాబు:   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.

37.   ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

జవాబు:  మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.

38   PF గరిష్టంగా ఎంత పెంచవచ్చు. ఎన్ని సార్లు పెంచవచ్చు??

జవాబు:  జీఓ.326 ; ఆర్థిక ; తేదీ:21.12.88 ప్రకారం PF చందా గరిష్టంగా పే+డీఏ కి మించకుండా ఉండాలి. జీఓ.21 ; ఆర్ధిక; తేదీ:24.1.81 ప్రకారం PF ప్రీమియం సంవత్సరం లో రెండు సార్లు పెంచుకోవచ్చు.ఒక్కసారి తగ్గించుకోవచ్చు.

39   నేను sgt గా చేస్తున్నాను.నేను meo అనుమతి తో 30 రోజులు హాఫ్ పే లీవ్ ఉపయోగించుకొని B. ed పూర్తి చేశాను.నా బీ. ఎడ్ చెల్లుబాటు అవుతుందా??

జవాబు:   సరైన పద్ధతి కాదు.deo అనుమతి లేకుండా రెగ్యులర్ కోర్సు చదవటం రూల్స్ కి విరుద్ధం.ఇప్పటికైనా deo గారికి దరఖాస్తు చేసి ఆ పీరియడ్కు సెలవు మంజూరు చేఇ0చుకుంటే మీ B.ed చెల్లుబాటు అవుతుంది.

40    పిఈటీ,క్రాఫ్ట్,డ్రాయింగ్,పండిట్ పోస్టుల్లో పనిచేస్తున్న టీచర్లు కి LFL HM పదోన్నతి పొందే అవకాశం ఉందా??

జవాబు: జీఓ.11/12 ; తేదీ:23.1.2009 ప్రకారం కేవలం sgt లకి మాత్రమే lfl hm గా పదోన్నతి పొందే అవకాశం ఉంది.

41     సరెండర్ లీవ్ జీతంపై ఐఆర్ వస్తుందా??

జవాబు:   రాదు.

42    నేను మున్సిపాలిటీ లో sgt ను.నేను 1 ఇయర్ పాటు జీత నష్టం సెలవు పెట్టాలని అనుకుంటున్నాను.మంజూరు చేసే అధికారం ఎవరికి ఉంటుంది??

జవాబు:   మున్సిపాలిటీ టీచర్ల కి నియామకపు అధికారి కమీషనర్ కనుక 1 ఇయర్ eol మంజూరు చేసే అధికారం కూడా కమీషనర్ కే ఉంటుంది.

43.     HM సెలవు పై వెళ్లే సందర్భంలో ఇన్చార్జి భాద్యతలు ఎవరికి ఎలా ఇవ్వాలి.

జవాబు:    Rc. No.2409 ; తేదీ:27.1.2005 ప్రకారం HM సెలవు పెట్టే సందర్భంలో సీనియర్ మోస్ట్ కి భాద్యతలు అప్పగించాలి.ఇన్ ఛార్జ్ ఇచ్చిన విషయం స్టాఫ్ ఆర్డర్ లో రాసి సంబంధిత టీచర్ ఆమోదం తీసుకోవాలి.సదరు విషయం సెలవు మంజూరు అధికారికి తెలియపరచాలి.

44    CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు??

జవాబు:    ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.

45.     స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు??

జవాబు:    ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు

46    మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇ0చుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా??

జవాబు:   జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.

47   CL మరియు CCL ఒకేసారి వాడుకోవచ్చా??

జవాబు:   CL మరియు CCL కలిపి వాడుకోకూడదు

 

50.కొత్త గా ఉద్యోగం లో చేరిన వారికి APGLI ఎప్పటి నుంచి కట్ చెయ్యాలి??

జవాబు:జీఓ.199 ; ఆర్థికశాఖ ; తేదీ:30.7.13 ప్రకారం మొదటి నెల వేతనం నుంచే apgli మినహాయించాలి

 

సందేహాలు - సమాధానాలు (51 - 75) : -

51 సమాచార హక్కు చట్ట0 ద్వారా సమాచారం కోరితే ఎన్ని రోజుల లోపు సమాధానం ఇవ్వాలి??

జవాబు:30 రోజుల లోపు సమాధానం ఇవ్వాలి.

 

 

52.:SR లో సర్వీస్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎంటర్ చెయ్యాలి?

జవాబు:మెమో.8388 తేదీ:20.1.12 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సర్వీస్ వెరిఫికేషన్ ఎంటర్ చెయ్యాలి.

 

 

53 నాకు మొదటి సారి బాబు.తర్వాత కవల పిల్లలు పుట్టారు.ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా?

జవాబు: ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.

 

 

54 : నేను 2016-17 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయలేదు. డిసెంబరు 2016లో రూ.2,15,000 ఒకేసారి బ్యాంకులో జమ చేశాను. ఆ వివరాలు రిటర్నులో పేర్కొనాల్సి ఉంటుందని అన్నారు. అసలు సమర్పించకపోతే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ, ఇటీవల నాకు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి తరచూ సందేశాలు, ఈమెయిళ్లు వస్తున్నాయి. నా మొత్తం ఆదాయం రూ.4లక్షలు. ఆదాయపు పన్ను రూ.5,300 చెల్లించాను. రిటర్నులు దాఖలు చేస్తే ఏదైనా సమస్య వస్తుందా?

 జవాబు : మీ ఆదాయం కనీస పరిమితి (రూ.2,50,000) దాటినప్పుడు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు తేదీ దాటినప్పటికీ.. ఈ రిటర్నులను మార్చి 31, 2018 సమర్పించేందుకు అవకాశం ఉంది.

 

 

*ఈలోపు మీరు రిటర్నులు దాఖలు చేస్తే ఎలాంటి అపరాధ రుసుము విధించరు. మీరు ఒకేసారి జమ చేసిన నగదు రూ.2,15,000 గురించి కూడా రిటర్నులలో పేర్కొనాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తగిన ఆధారాలు సేకరించి పెట్టుకోండి. 


55. : 2016లో ఒక ప్లాటు అమ్మాను. దానికి సంబంధించి రూ.9లక్షలు చెక్కు రూపంలో వచ్చాయి. అప్పటి నుంచి ఆ డబ్బు అలాగే బ్యాంకు పొదుపు ఖాతాలో ఉంది. ఆ డబ్బును వెనక్కి తీసుకునేందుకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా? కచ్చితంగా మరో ప్లాటు కొనాలా?

    జవాబు : ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక ప్లాటు అమ్మినప్పుడు.. మీరు కొన్న తేదీ నుంచి ఆ ప్లాటు కొని మూడేళ్లు గడిస్తే.. దీర్ఘకాలిక మూలధన రాబడిని గణించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. మీకు ఆ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆదాయాలతో కలిపి, రిటర్నులు దాఖలు చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక మూలధన రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్లాటు అమ్మిన తేదీకి ముందు ఉన్న 12 నెలల్లో ఫ్లాటు లేదా ఇల్లు కొని ఉంటే.. చట్టప్రకారం మినహాయింపు పొందే వెసులుబాటు ఉంది. గడువు తేదీ దాటింది కాబట్టి, ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు మీకు అవకాశం లేదు. రిటర్నులు దాఖలు చేసి, వర్తించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


56: నేను ప్రభుత్వ ఉద్యోగిని. షేర్లలో కూడా పెట్టుబడి పెడుతుంటాను. నా ఫారం-16లో ఈ విషయాన్ని నేను పేర్కొనలేదు. రిటర్నులు దాఖలు చేసేప్పుడు నేను కచ్చితంగా నాకు వచ్చిన లాభనష్టాలను చూపించాల్సి ఉంటుందా? దీనివల్ల నాకు ఏదైనా ఇబ్బంది వస్తుందా?

 జవాబు : ఆదాయ పన్ను ప్రస్తుత నిబంధనల ప్రకారం షేర్లలో జరిపే లావాదేవీలన్నీ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. మీరు జరిపిన లావాదేవీల రికార్డులన్నీ కూడా ఆదాయపు పన్ను శాఖకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి, మీరు రిటర్నులు దాఖలు చేసేప్పుడు ఈ వ్యవహారాలన్నీ రిటర్నులలో పేర్కొనండి. మీ జీతం, షేర్లలో వచ్చిన లాభనష్టాలను తెలియజేస్తూ రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం.

 

57 : నాకు మా పుట్టింటి నుంచి గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా ఒక ఇల్లు వచ్చింది. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. దీన్ని అమ్మినప్పుడు, వచ్చిన మొత్తాన్ని నేను ఆదాయం పన్ను రిటర్నులలో చూపించాలా? నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇలాంటప్పుడు నాకు అధిక పన్ను భారం లేకుండా ఏం చేయాలి?

 జవాబు : అమ్మిన ఇల్లు.. గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా వచ్చినప్పటికీ.. వాస్తవ కొనుగోలు తేదీ నుంచి మూడేళ్లు దాటితే దాన్ని దీర్ఘకాలిక ఆస్తిగానే చట్టం పరిగణిస్తుంది. దానిపై వచ్చిన రాబడిని దీర్ఘకాలిక మూలధన లాభంగా చూపించి, వర్తించే పన్ను చెల్లించాలి. మీరు ఈ 2017-18 ఆర్థిక సంవత్సరంలో అమ్మి ఉంటే... జులై 31, 2018లోపు మరో ఇల్లు లేదా ఫ్లాటుపై పెట్టుబడి పెట్టడం ద్వారా పూర్తి మినహాయింపు పొందవచ్చు.

 

58 ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?

జవాబు:G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.

 

59:ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?

జవాబు: A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.

 

 

60:సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?

జవాబు:FR-24 లో "Increment should be drawn as a matter of course,unless it is withheld" అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.

 

 

61కారుణ్య నియామక పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?

జవాబు:కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.

 

62ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?

జవాబు:జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.

 

63 నేను ఒక cps ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు.

జవాబు:మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.

 

64 ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?

జవాబు:వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు.ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు.1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.

 

65 ఐటీ లో ధార్మిక సంస్థ లకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది??

జవాబు: కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది

 

66:ఉదయం CL పెట్టి మధ్యాహ్నం బడికి వెళ్లాలని అనుకుంటే ఎలా చేయాలి?

జవాబు: APTeLS యాప్ లో ఒక పూట సెలవుకి ఆప్షన్ లేదు. మనం ఉదయం పూట సెలవు పెట్టాలనుకుంటే, ముందుగా ఒక రోజు మొత్తానికి అప్లై చేయాలి. తదుపరి మనం సెలవు పెట్టిన రోజు మధ్యాహ్నం బడికి వెళ్ళి IRIS login కాగానే ఆటోమేటిగ్గా ఉదయం సెలవు, మధ్యాహ్నం హాజరు నమోదౌతుంది.

 

67 ఉదయం బడికి వెళ్లి,మధ్యాహ్నం CL పెట్టాలి అంటే ఎలా చేయాలి?

జవాబు: బడికెళ్ళాక మధ్యాహ్నం సెలవు కావాల్సి వస్తే మొత్తం రోజుకి సెలవు అప్లై చేస్తే ఆటోమేటిగ్గా కేవలం మధ్యాహ్నం ఒక్క పూటకే సెలవు నమోదౌతుంది.

 

68 టాబ్ లో ఈ రోజు సాయంత్రం(బడి వదిలే ముందు)రేపటి కోసం CL అప్లై చేశాను. ఐతే నాకు పని పూర్తి అయినందున బడికి వెళ్లాలని అనుకుంటున్నాను.నేను ఇప్పుడు ఏమి చేయాలి?? ఇటువంటి సమస్య కోసం ఏదైనా ఆప్షన్ ఉందా??నా CL పోయినట్లేనా?

 

జవాబు: మీరు CL నష్టపోవాల్సిన అవసరం లేదు. మీరు స్కూల్ కి వెళ్లి ఐరిష్/థంబ్ వేయగానే ముందు రోజు మీరు అప్లై చేసిన CL ఆటోమాటిక్ గా రద్దు అవుతుంది.

 

69 నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12సం.లు సర్వీసు పూర్తి చేసితిని.12సం.లు స్కేలు రావడానికి నేను EOT,GOT పరీక్షలు పాస్ అయ్యాను.నాకు12సం.లు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు?

జవాబు  ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12 సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT,GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేయాలి.

 

70:నాకు 50 ఇయర్స్ దాటినవి.నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?

జవాబు: G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది.అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది.కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT,GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.

 

71 :SGTలలో 50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?

జవాబు:కారు.వారు కూడా G.O.Ms.No.93,Dt.03.04.2010 ప్రకారం అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.

 

72 నా భార్య టీచర్.ఆమె మరణించి0ది.రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరు పొందుతారు?

జవాబు: భార్యాభర్తలు ఇద్దరూ టీచర్లు అయి, భార్య మరణించిన సందర్భంలో భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు & పెన్షన్ భర్త తీసుకోవచ్చు.అలా కాకుండా భార్య మరణించిన తరువాత సమర్పించే ఫారాలు లో నామినీ గా కొడుకు పేరు రాస్తే(కొడుకు కి 18 సంవత్సరం లు పైన ఉండాలి) భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు మొత్తం కొడుకు తీసుకుంటాడు.

 

73.ఐటీ లో రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం కింద ఎంత పన్ను మినహాయింపు పొందవచ్చు?

జవాబు: వార్షిక ఆదాయం 12 లక్షల లోపు గలవారు గరిష్ఠ0గా 50,000/- వరకు పొదుపు చేసి 25,000/- వరకు మినహాయింపు పొందవచ్చు.

 

74:బయోమెట్రిక్/ఐరిష్ సాఫ్ట్వేర్ ను ఎవరు రూపొందించారు?

జవాబు: వేలిముద్రలు "కార్వే డేటా మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్" వారికి, ఐరిష్ ను "అనాలజీస్ టెక్ ఇండియా లిమిటెడ్"వారికి అప్పగించారు.

 

75 నేను FAC HM గా 2 ఇయర్స్ పని చేశాను.3 నెలల కాలానికి FAC అలవెన్సు RJD గారు మంజూరు చేసారు. మిగిలిన కాలానికి అలవెన్సు ఎవరు ఇస్తారు?

జవాబు: మీరు DSE గారికి దరఖాస్తు చేసుకోవాలి.

 

సందేహాలు - సమాధానాలు (76 - 100) 

76    స్కూల్ కాంప్లెక్స్ లో TLM గ్రాంట్ కింద ఎంత ఖర్చు చేయవచ్చు?

జవాబు:   7000/- వరకు ఖర్చు చేయవచ్చు.

 

77  . ప్రస్తుతం ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎక్కడ ఏర్పాటు చేశారు?

జవాబు: విజయవాడలో న్యూ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్, మొదటి ఫ్లోర్, M.G రోడ్, స్టేడియం ఎదురు లో ఏర్పాటు చేశారు.

 

78    నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా?

జవాబు: మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.

 

79    నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?

జవాబు:వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.

 

80:   11 రోజులను కూడా సరెండర్ చేసుకోవచ్చా?

జవాబు: జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.

 

81:   సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి?

జవాబు: జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు,స్పెషల్ పే చెల్లించబడతాయి.ఐతే IR మాత్రం చెల్లించబడదు.

 

82:   నేను 31.7.17న రిటైర్డ్ అవుతాను.నా ఇంక్రిమెంట్ నెల ఆగస్టు. నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా?

జవాబు: జీఓ.235 తేదీ:27.10.1998 ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన మరుసటి రోజు గల ఇంక్రిమెంట్ పెన్షన్ కి లెక్కించబడుతుంది.


83    నేను Sgt నుండి SA గా పదోన్నతి పొందాను.నా కన్నా జూనియర్ sgt నుంచి lfl hm గా పదోన్నతి పొంది , నా కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు నేను స్టెప్ అప్ చేఇ0చు కోవచ్చా?

జవాబు: వీలు లేదు. ఒకే కేటగిరీ లో ఒకే సబ్జెక్టులో పదోన్నతి పొందిన వారితో మాత్రమే స్టెప్ అప్ కు అవకాశం ఉంది.


84     వేసవి సెలవుల్లో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకి invegilator గా వెళ్లాను. ఏ జీఓ ప్రకారం ELs జమ చేస్తారు.?

జవాబు: ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదు. Rc. No.362 తేదీ:16.11.2013 CSE, AP ప్రకారం ELs జమ చేయవచ్చు.


85:      నేను sgt గా చేస్తున్నాను.AU లో అడిషనల్ సబ్జెక్టు గా తెలుగు చేశాను. నాకు SA తెలుగు కి అవకాశం ఉంటుందా?

జవాబు: తెలుగు అదనపు సబ్జెక్టు గా చేస్తే అర్హత ఉంటుంది. సింగిల్ సబ్జెక్టు గా చేస్తే అర్హత వుండదు.
 

86    ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా?

జవాబు:అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేఇ0చుకోవచ్చు.

 

87    స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి?

జవాబు: జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.


88   సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి?

జవాబు: సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.


89    ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా?

జవాబు:అవసరం లేదు.


90     మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా?

జవాబు: అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.


91    నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??

జవాబు: స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.

 

92 :   అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఐటీ లో మినహాయింపు ఏమైనా ఉందా?

జవాబు:తీవ్ర రోగాల చికిత్స కై చేసిన వాస్తవ ఖర్చు లో 40,000రూ వరకు 80DDB కింద మినహాయింపు కలదు.దీని కోసం డాక్టర్ ధ్రువ పత్రం సమర్పించాలి.


93    ఏ ఏ టీచర్లు కామన్ సర్వీసు రూల్స్ పరిధిలోకి వస్తారు??

జవాబు :ప్రస్తుతం పంచాయతీ రాజ్ టీచర్లు మరియు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు మాత్రమే వస్తారు.


94   నేను అంతర. జిల్లా బదిలీల లో వచ్చాను.నా సీనియారిటీ కి రక్షణ ఉంటుందా?

జవాబు: మీరు 610జీఓ ద్వారా వస్తే రక్షణ ఉంటుంది. సాధారణ అంతర్ జిల్లా బదిలీల లో వస్తే మాత్రం కొత్త జిల్లాలో చేరిన తేదీ నుంచి మాత్రమే సీనియారిటీ లెక్కించబడుతుంది.


95    నేను,మరొక టీచర్ ఇద్దర0 ఒకే DSC లో సెలెక్ట్ అయ్యాము.ఒకే స్కూల్లో చేరాము.ఎవరు HM భాద్యతలు తీసుకోవాలి?

జవాబు: మెరిట్ కమ్ రోస్టర్ లో ఎవరు ముందుంటే వారే సీనియర్. సీనియర్ ఐన టీచర్ HM గా చేయాలి.


96)   17 ఇయర్స్ సర్వీస్ గల టీచర్ వైద్య కారణం పై PF లోను తీసుకున్నాడు.6 నెలలు గడిచింది.గృహ నిర్మాణం నిమిత్తం పార్ట్ ఫైనల్ తీసుకోవటానికి వీలుందా?

జవాబు:మీ మొత్తాన్ని పార్ట్ ఫైనల్ కింద మార్చుకొని మాత్రమే 6 నెలల తరువాత పార్ట్ ఫైనల్ పొందే అవకాశం ఉంది.

 

97:   నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి??

జవాబు: జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.

 

98   నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?

జవాబు:FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.


99    డైస్ నాన్ కాలం అంటే ఏమిటి?

జవాబు:FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ. FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.

 

100 అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా?

జవాబు:టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.

 

సందేహాలు - సమాధానాలు (101 - 125) 

101 నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా?

జవాబు:చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.


102 EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా?

జవాబు:EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.


103 నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి?

జవాబు:FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.


104 నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..?

జవాబు:మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.    ( GO MS No:262, Dt:25-8-1980)

 

105 సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి మరణించినచో ఏమి జరుగుతుంది??

జవాబు: జీఓ.275 , తేదీ:8.8.77 ప్రకారం సస్పెన్షన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు.
106 జీతం డబ్బులు తీసుకోవటానికి కేవలం SBI/SBH లోనే అకౌంట్ ఉండాలా?

జవాబు: జీఓ.58, తేదీ:21.3.05 ప్రకారం ప్రభుత్వం సూసించిన SBI/SBH బ్యాంక్ లలో ఏదో ఒక దానిలో అకౌంట్ ఉండాలి.


107ఈ సంవత్సరం వార్షికోత్సవం జరపాలని అనుకొనుచున్నాము.డబ్బులు ఎంత ఇస్తారు?

జవాబు:ప్రైమరీ స్కూళ్ళుకి 100 లోపు పిల్లలు ఉంటే 800రూ,100 పైన పిల్లలు ఉంటే 1000రూ ఇస్తారు. అదే అప్పర్ ప్రైమరీ కి 100 లోపు ఉంటే 1000రూ,100 పైన ఉంటే 1200రూ ఇస్తారు.


108 కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేక సెలవు ఏమైనా ఇస్తారా?

జవాబు: జీఓ.286,తేదీ:29.10.91 ప్రకారం 6 నెలలు గరిష్టంగా అర్ధ వేతన సెలవులకి అర్హుడు.ఈ కాలంలో పూర్తి వేతనం పొందవచ్చు.


109 వేసవి సెలవులు మరియు వ్యక్తిగత0గా పెట్టుకున్న సెలవులు 6 నెలలకు మించిన ఏమి జరుగుతుంది??

జవాబు: జీఓ.143,తేదీ:1.6.68 ప్రకారం 6 నెలలకు మించితే మొత్తం "లీవ్" గా పరిగణించబడుతుంది.

 

110 నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి?

జవాబు: జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.

 

111 నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?

జవాబు:FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.


112 డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??

జవాబు: FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ. FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.


113 అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా?

జవాబు: టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.


114 నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా

జవాబు: చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.


115 EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా??

జవాబు:EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.
 

116 నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి??

జవాబు: FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.


117: నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..?

జవాబు: మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు. (GO MS No:262, Dt:25-8-1980)

 

118: అడ్మిషన్ రిజిస్టర్ లో ఒక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ/కార్పొరేషన్ వారు ఇచ్చిన సెర్టిఫికెట్ లో మరొక పుట్టిన తేదీ ఉంది.మున్సిపాలిటీ సెర్టిఫికెట్ ప్రకారం పుట్టిన తేదీ నామినల్ రోల్స్ లో మార్చమని పేరెంట్స్ అడుగుతున్నారు.అలా మార్చవచ్చా?

జవాబు:SSC రూల్స్ 6 ప్రకారం తనిఖీ అధికారి అనుమతితో మార్పు చేయవచ్చు.


119 ఒక టీచర్ జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.ఆమె ఇంక్రిమెంట్ అక్టోబర్ నెలలో ఉంది.ఆమెకు ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి?

జవాబు: జీఓ.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ఇంక్రిమెంట్ అక్టోబర్ 1 నుండి మంజూరు చేస్తూ,ఆర్ధిక లాభం విధులలో చేరిన తేదీ నుంచి మంజూరు చెయ్యాలి.


120 ఐటీ కేవలం ఫిబ్రవరి జీతంలోనే మినహాయించాలా??

జవాబు:ఐటీ నిబంధనలు ప్రకారం చెల్లించవలసిన ఐటీ ముందే అంచనా వేసి మార్చి నెల జీతం నుండి ప్రారంభించి నెలనెలా మినహాయించాలి.ప్రతి క్వార్టర్ కి రిటర్న్స్ ఐటీ శాఖకు సమర్పించాలి.ఈ భాద్యత DDO లదే.


121 ఒకరు మిలటరీ లో చేసి రిటైర్మెంట్ అయి,మరల sgt గా చేరి రిటైర్డ్ అయ్యారు.ఇపుడు అతనికి రెండు పెన్షన్లు వస్తాయా?

జవాబు:ఏపీ పెన్షన్ రూల్స్ ప్రకారం రెండు పెన్షన్లు పొందవచ్చు.


122 నేను SA క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ పొందాను.ఇటీవల HM గా పదోన్నతి వస్తే వదులుకున్నాను.ప్రస్తుతం నాకు జరిగే నష్టం ఏమిటి?

జవాబు: మెమో.3307 ; ఆర్ధిక ; తేదీ:24.2.1993 ప్రకారం 18,24 ఇయర్స్ స్కేల్స్ ఇక ఇవ్వరు.ఇచ్చిన 12 ఇయర్స్ స్కేల్ మాత్రం కొనసాగుతుంది.

 

123 అప్రంటీస్ కాలంలో EOL వాడుకోవచ్చా.??వాడుకుంటే ఇంక్రిమెంట్లు పోస్టుపోన్ అవుతాయా.?

జవాబు: అర్హత లేదు.FR(బి)ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నత చదువులు, వైద్య కారణాలపై వినియోగించుకున్న EOL కాలం ఇంక్రిమెంట్లు కి పరిగణింపబడుతుంది.


124 డైస్ నాన్ కాలం పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతుందా?

జవాబు: FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, పెన్షన్ ప్రయోజనాలకు అర్హత గల సెలవుగా పరిగణించబడదు.


125 డైస్ నాన్ శిక్షను రద్దు లేదా మార్పు చేయించుకోవాలీ అంటే ఎవరికి అప్పీల్ చేసుకోవాలి?

జవాబు: ఉత్తర్వులు ఇచ్చిన 90 రోజులలోగా అప్పిలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవాలి.

 

 

సందేహాలు - సమాధానాలు (126 - 150) 

126: ZPPF లోన్ తిరిగి చెల్లించకుండా ఉండాలంటే ఉద్యోగికి ఎంత సర్వీసు ఉండాలి.??

జవాబు: 20 ఇయర్స్ సర్వీసు నిండితే లోన్ అమౌంట్ తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో మరియు ఇంటి కన్స్టక్షన్ సగంలో ఆగిపోయిన సందర్భంలో సరియైన పత్రాల ఆధారంగా 15 ఇయర్స్ సర్వీసు నిండిన ఉద్యోగి కూడా లోన్ తిరిగి చెల్లించకుండా ఉండవచ్చు.


127 ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో నుంచి మన అత్యవసరాలకు దాచుకున్న మొత్తంలో కొంత వెనక్కి లేదా అప్పుగా తీసుకవచ్చు కదా! జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ఇలా తీసు కోవడం వీలవుతుందా? పదవీ విరమణ, అత్యవసరాలకు సంబంధించి ఈ రెండింటిలో ఏది మెరుగైనది??

జవాబు: దీర్ఘకాలిక అవసరాల కంటే తక్షణ అవసరాలు, కోరికలు, కలల కోసం ఖర్చు పెట్టాలని చూడటం మానవ బలహీనత. పదవీ విరమణ చేశాక పింఛను అత్యవసరం. పింఛను కోసం మొదలు పెట్టిన దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను మధ్యలో తీసుకోకూడదనే లక్ష్యంతో ఎన్‌పీఎస్‌ టైర్‌ 1 ఖాతాలో మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోకూడదనే నిబంధన విధించారు. ఇటీవల దీన్ని కొంత సడలించారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, గుండెపోటు, పక్షవాతం, ప్రమాదం వంటి ఆరోగ్య అవసరాలకు మన ఎన్‌పీఎస్‌ నిల్వలో 25శాతం వెనక్కి తీసుకోవచ్చు.ఎన్‌పీఎస్‌ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత ఈ సదుపాయం లభిస్తుంది. పదవీ విరమణ చేసేలోగా మూడుసార్లు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. పీపీఎఫ్‌లో వడ్డీ జనవరి నుంచి 7.6శాతం. ఎన్‌పీఎస్‌ టైర్‌-1 ఈక్విటీలో గత ఐదేళ్ల రాబడి 14శాతం వరకూ ఉంది.ఇందులో ప్రభుత్వ బాండ్‌ పథకంలో కూడా రాబడి 8.47% పైగానే ఉంది. సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, అదనంగా మరో రూ.50వేల పెట్టుబడి వరకూ ఎన్‌పీఎస్‌లో మదుపు చేసి, ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు. కాబట్టి, మీరు ఎన్‌పీఎస్‌ ఎంచుకోవచ్చు.

 

128: భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు.ఒకరు రిటైర్మెంట్ అయ్యారు.పెన్షన్ వస్తుంది. రెండవ వారు మరణించిన వారి వారసులకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారా?

 

జవాబు: మెమో.3548 ;GAD; తేదీ:24.3.12 ప్రకారం ఒకరికి పెన్షన్ వచ్చుచున్నందున కారుణ్య నియామకం వర్తించదు.*
129  ఒక ఉద్యోగిని ఎంత కాలం సస్పెన్షన్ లో ఉంచవచ్చు?

జవాబు: జీఓ.526 : GAD; తేదీ:19.8.08 ప్రకారం ఒక ఉద్యోగిని 2 సంవత్సరం లకి మించి సస్పెన్షన్ పీరియడ్ లో ఉంచకూడదు.


130  ఒక మహిళా ఉద్యోగికి వివాహం కోసం డబ్బులు ఏమైనా అప్పుగా ఇస్తారా???

జవాబు: జీఓ.39 ; ఆర్థికశాఖ; తేదీ:15.4.15 ప్రకారం 75000/- అప్పుగా ఇస్తారు. దీనిని 70 వాయిదా లలో తిరిగి చెల్లించాలి.


131 ప్రత్యేక ఆశక్తత సెలవులో ఉన్న వారికి జీతభత్యాలు ఎలా చెల్లించాలి??

జవాబు: 120 రోజుల వరకు పూర్తి జీతం,మిగిలిన కాలానికి సగం జీతం చెల్లిస్తారు.


132 కమ్యూటెడ్ సెలవును హాఫ్ పే లీవ్ గా మార్చుకోవచ్చా?

జవాబు: జీఓ.143 తేదీ:1.6.68 ప్రకారం వీలులేదు.


133. బీసీ క్రిమిలేయర్ పరిధిలోకి ఎవరు వస్తారు?

జవాబు: కేవలం గ్రూప్--1&11 సర్వీసులో ఉన్న ఉద్యోగులు మాత్రమే వస్తారు.టీచర్లు క్రిమిలేయర్ పరిధిలోకి రారు మరియు 6 లక్షల ఆదాయం కలిగిన బీసీ ఉద్యోగుల0దరూ క్రిమిలేయర్ పరిధిలోకి రారు.

 

134: నేను SGTగా పనిచేస్తున్నాను.ప్రస్తుతం నా ఖాతాలో 80 ELs ఉన్నాయి. నేను బ్యాంక్ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను.జాబ్ లో చేరితే నా 80 ELs నాకు ఉంటాయా?

జవాబు: జీఓ.46, ఆర్ధిక తేదీ:19.2.2014 ప్రకారం మీరు వేరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ0లో చేరితేనే మీ సెలవులు మొత్తం క్వారీ ఫార్వర్డ్ అవుతుంది. బ్యాంక్ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు కాదు.కాబట్టి 80 ELs రద్దు అవుతాయి.


135 అడ్మిషన్ రిజిస్టర్ లో కులం,పుట్టిన తేదీ, తల్లి తండ్రులు పేర్లు మార్చవచ్చా?

జవాబు: తల్లి తండ్రులు కోరిక మేరకు మార్చవచ్చు. ఐతే సంబంధిత ధ్రువపత్రాలు, నోటరీ అఫిడవిట్ దగ్గర పెట్టుకోవాలి.Remarks కాలంలో కారణం రాయాలి.


136 ఒక టీచర్ 7 ఇయర్స్ కూడా ఉద్యోగం చేయకుండా అనారోగ్యంతో మరణించిన, నామినీ కి పెన్షన్ ఎంత వస్తుంది?

జవాబు: అతని చివరి బేసిక్ పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు


137 ఒక పెన్షనర్ మరల వివాహం చేసుకున్నాడు.మరల ఒక కుమారుడు జన్మించారు. ఇతను కుటుంబ పెన్షన్ తీసుకొనుటకు అర్హుడేనా?

జవాబు: జీఓ.236,ఆర్ధిక తేదీ:28.5.1994 ప్రకారం అర్హులే.


138 ఒక పెన్షనర్ రెండు పెన్షన్ లు తీసుకుంటూ ఉంటే అందులో ఒక DA ని వదులుకోవాలా?

జవాబు: జీఓ.35, ఆర్థికశాఖ తేదీ:9.8.74 ప్రకారం రెండు పెన్షన్ లు తీసుకోనువారికి ఆ రెండు పెన్షన్ లపై DA లలో ఏది ఎక్కువో ఆ DA ని ఉంచుకోవచ్చు.తక్కువ DA ని వదులుకోవలసి ఉంటుంది.


139 పోస్టులు సృష్టించు అధికారం కలెక్టర్ గారికి ఉంటుందా?

జవాబు: జీఓ.427, GAD తేదీ:1.7.91 ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి 5 పోస్టులు సృష్టించు అధికారం ఉంటుంది.

 

140: ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??

జవాబు: మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.


141 ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.

జవాబు: Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.


142 ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

జవాబు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.


143 ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

జవాబు:మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.


144 PF గరిష్టంగా ఎంత పెంచవచ్చు. ఎన్ని సార్లు పెంచవచ్చు?

జవాబు: జీఓ.326 ; ఆర్థిక ; తేదీ:21.12.88 ప్రకారం PF చందా గరిష్టంగా పే+డీఏ కి మించకుండా ఉండాలి. జీఓ.21 ; ఆర్ధిక; తేదీ:24.1.81 ప్రకారం PF ప్రీమియం సంవత్సరం లో రెండు సార్లు పెంచుకోవచ్చు.ఒక్కసారి తగ్గించుకోవచ్చు.

 

145 నేను SA గా పనిచేస్తున్నాను.నేను లెక్చరర్ పోస్టుకి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ నాకు వస్తే, పాత పెన్షన్ విధానం వస్తుందా?

జవాబు: ఏపీ revised పెన్షన్ రూల్స్ ప్రకారం మీకు పాత సర్వీసు కౌంట్ అవుతుంది. ఐతే మీరు deo అనుమతి తో పరీక్ష రాసి ఉండాలి.కొత్త జాబ్ లో కూడా deo అనుమతి తో చేరాలి.

 

146 2014 dsc ద్వారా సెలెక్ట్ ఐన వారు ప్రాన్ నెంబర్ కోసం ఏ ఫారం లో దరఖాస్తు చేయాలి?

జవాబు: Csrf-1,ఎస్-5,ఎస్-6 ఫారం లను www.nsdl. co. in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, వాటిని పూర్తి చేసి sto ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

147 నేను sgt గా పనిచేస్తున్నాను.ma(ఇంగ్లీషు), ma(ఎడ్యుకేషన్) చేశాను. నాకు SA ఇంగ్లీషు పదోన్నతి ఇస్తారా?

జవాబు: జీఓ.66 తేదీ:4.7.09 ప్రకారం 1981--2009 మధ్య ఆంధ్రా యూనివర్సిటీ నుండి పొందిన ఎంఏ(ఎడ్యుకేషన్) డిగ్రీని బి. ఎడ్ కి సమానంగా పరిగణించి పదోన్నతి కి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.అందువల్ల మీకు sa ఇంగ్లీషు పదోన్నతి కి అవకాశం ఉంది.

 

148 ఒక టీచర్ ఇప్పటి వరకు 200 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకున్నాడు.ఇంకా ఎన్ని వాడుకోవచ్చు?? ఇంకా సెలవులు అవసరం ఐతే ఎలా చేయాలి?

జవాబు: ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు. అపుడు అర్ధ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఇంకా సెలవు అవసరం ఐతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే వాడుకోవాలి.ఐతే ఖాతాలో ఉండి ఉండాలి.

 

149 సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.ముందు రోజు CL పెడితే ఏమి జరుగుతుంది??

జవాబు: సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు cl పెడితే మొత్తం రోజులు 11 అవుతాయి.అందువల్ల మొత్తం సెలవులు 11 రోజులకి అర్హత గల సెలవును(el/hpl/mcl/eol...) పెట్టుకోవలసి ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు cl పెట్టకూడదు.

 

150: CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు??

జవాబు: ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.

 

సందేహాలు - సమాధానాలు (151 - 175) 

 151.  స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు?

ANS:  ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 7 రోజులకి మించకూడదు.

 152.  మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇ0చుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా?

జవాబు:   జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.

153.  CCL ఒకేసారి వాడుకోవచ్చా?

జవాబు:  మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు.1 ఇయర్ లో 10 రోజులకి మించి   వాడుకోకూడదు

154.  "లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?

జవాబు:  1933 aplr రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు

155.  ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు?

జవాబు:  రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లురావు.ఐతే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితి లలో మంజూరు చేయవచ్చు.

156. నేను 9.11.17న ఉద్యోగం లో చేరాను.నాకు వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ 9 నుండి ఇస్తారా?? లేక నవంబర్ 1 నుండి ఇస్తారా?

జవాబు:  జీఓ.133 , ఆర్ధిక ; తేదీ:13.5.76 ప్రకారం నియామకం తేదీ నెలలో ఏ తేదీన ఉన్నా, ఆ నెల మొదటి తేదీ నుండే వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చెయ్యాలి.

157. నేను sgt గా పనిచేస్తున్నాను.EOT, GOT పాస్ కాలేదు. నాకు 51 సంవత్సరంలు.నాకు ఇప్పుడు 24 ఇయర్స్ స్కేల్ ఇస్తారా?

జవాబు:  మీకు 50 ఇయర్స్ దాటినప్పటికీ 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వాలి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కావాలి.వాస్తవానికి PRC లో మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆర్ధిక శాఖ ఒప్పుకోలేదు.

158.కారుణ్య నియామకం కింద నా కుమారుడు కి ఉద్యోగం ఇవ్వాలి అంటే నాకు ఎంత సర్వీస్ మిగిలి ఉండాలి?

జవాబు: జీఓ.661, ఆర్ధిక : తేదీ:23.10.08 ప్రకారం అనారోగ్య కారణాలతో రిటైర్డ్ అయి, వారసుడు కి కారుణ్య నియామకం కావాలి అంటే, రిటైర్మెంట్ తేదీ నాటికి 5 ఇయర్స్ సర్వీస్ మిగిలి ఉండాలి.*

159. LFL HM పదోన్నతి పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి?

జవాబు: సర్వీసు నిబంధనలు ప్రకారం ఇంటర్, డీ.ఎడ్ చాలు.డిగ్రీ,బీ.ఎడ్ ఉండవలసిన అవసరం లేదు

160.  నేను జీత నష్టం సెలవు పెట్టిన కారణంగా నా ఇంక్రిమెంట్ 29.1.17 కి మారింది.ఇపుడు నాకు ఇంక్రిమెంట్ జనవరి 29న ఇస్తారా? లేక జనవరి 1న ఇస్తారా?

జవాబు:  మెమో.49643 ; ఆర్ధిక ; తేదీ:6.10.74 ప్రకారం అసాధారణ సెలవు కారణంగా వాయిదా పడిన ఇంక్రిమెంట్ ను ,ఆ నెల మొదటి తేదీ నుంచే మంజూరు చేయాలి.అంటే జనవరి 1 నుంచే ఇస్తారు.

 

161.   A) అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?

         B) ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?

సమాధానం:ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.
162:  ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?

సమాధానం:     ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది. SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.  SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు. పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.

163.   ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

సమాధానం:   వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.
(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

164 .   దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?

సమాధానం:   FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.


165 :   ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?

సమాధానం:   ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.

 

166.  మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

సమాధానం:  రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.

 

167.  ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?

సమాధానం:  అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి

168:  జాతీయ పండుగల రోజు జెండా వందనంకి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా?

జవాబు:  సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం జెండా వందనం కి హజరు కాకపోతే జాతీయ జెండాను అగౌరవపరచినట్లుగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

169:   స్థానికత దేని ఆధారంగా నిర్ణయిస్తారు?

జవాబు:  జీఓ.674 జీఏడీ: తేదీ:20.10.1975 రాష్టప్రతి ఉత్తర్వులలోని పేరా 7 ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు గల 7 ఇయర్స్ కాలంలో ఎక్కువ భాగం ఎక్కడ చదివితే ఆ జిల్లానే లోకల్ గా పరిగణింపబడుతుంది.

170 :   నేను 1996 డిసెంబరు లో SGT గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం(ఇఓఎల్)సెలవు పెట్టాను.ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరుకి మార్చుకొనే అవకాశం లేదా?

జవాబు:  జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో DEO ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసుగా పరిగణించబడుతుంది.

171 :  సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా?

జవాబు:  సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు.

172 :  ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరుహాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా?

జవాబు:  FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

173 :  నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. ఆగస్టు నెలలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.నాకు కొత్త PRC ప్రకారం బెనిఫిట్స్ వస్తాయా??పూర్తి పెన్షన్ వస్తుందా?

జవాబు:  పూర్తి పెన్షన్ రాదు.వాస్తవంగా 11వ PRC ,2018 జులై నుంచి అమల్లోకి రావాలి.ఐతే నోషనల్, మానిటరి బెనిఫిట్స్ ఎప్పటి నుంచి ఉంటాయో ఇప్పుడే చెప్పలేము

174 :  మెడికల్ సెలవు కోసం డాక్టర్ సెర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సెర్టిఫికెట్ ఒకే డాక్టర్ వద్ద తేవాలా?

జవాబు:  ఒకే డాక్టర్ వద్ద అవసరం లేదు. రెండూ వేర్వేరు డాక్టర్ల దగ్గర తేవచ్చు.*

175:   నా తలిదండ్రులకి వైట్ కార్డు ఉంది.పొరపాటున EHS లో నమోదు చేశాను. ఇపుడు తొలగించాలి అంటే నేను ఏమి చేయాలి?

జవాబు:  ehf పోర్టల్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.లేదా సంబంధిత ddo ను సంప్రదించాలి.

 

సందేహాలు - సమాధానాలు (176 -200)

176:  నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

జవాబు:   జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.*

177:  నేను PF నుండి ఋణం పొందియున్నాను.వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

జవాబు:  ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

178 :  ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

జవాబు:   జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*

179 :  ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??

జవాబు:    ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.

180 :  బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??

జవాబు:  Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.

181:    ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??

జవాబు:  చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

182 :  నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??

జవాబు:    జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.

183 :   మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??

జవాబు:    చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.

184 :   స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

జవాబు:    స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*

185 :  సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

జవాబు:    సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*

186 :   స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

జవాబు : జీఓ.15,16 తేదీ:7.2.2015   ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.

187 :   ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

జవాబు:  అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.

188 :  LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

జవాబు:  LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి. 50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.

189. ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?   ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జ:-   20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.*
( *G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980* ) *రూల్ : 42,43*

22    A) అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?

           B) ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?

సమాధానం:       ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు

190 : లోకల్ బాడీ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు 'ఫారెస్ట్ డిపార్టుమెంటులో' ఆఫీసర్ గా ఎంపిక కాబడ్డాడు.కొత్తపోస్ట్ కనిష్ట వేతనం ప్రస్తుత వేతనం కన్నా తక్కువగా ఉంది. నాకు వేతన రక్షణ (Pay Protection ) వర్తిస్తుందా?*

సమాధానం:   వేతన రక్షణ వర్తిస్తుంది. G.O.Ms.No.105 Fin(FR-II) Dept Dated:2-6-2011 ప్రకారం FR-22(a) (iv) ప్రయోజనాలు లోకల్ బాడీ ఉద్యోగులకు కూడా వర్తింపచేయబడ్డాయి.


191 :  ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?

సమాధానం:   ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.   SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT, EOT పరీక్షలు పాస్ కావాలి. SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.

       పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.

192 :   ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

సమాధానం:  వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.
(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

 

193 : దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?*

సమాధానం:  FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.
194 :  ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?

సమాధానం:  ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి
195:మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?*

సమాధానం:  రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.

196 :  ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?*

సమాధానం:    అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి

197
 :  ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు.*

సమాధానం  : F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి

198పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?*

సమాధానం : ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.
10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.
199 :  సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?

సమాధానం:  G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.
G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు
200:  నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?

సమాధానం:  అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి

 

సందేహాలు - సమాధానాలు (201- 225)

201 :  ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?*

సమాధానం:   అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి

202 :  ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు.*

సమాధానం  : F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి

203పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?*

సమాధానం : ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.
10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.
204 : 
సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?

సమాధానం:  G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.
G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు

 

205 :  నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?

సమాధానం:  అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి

206.  అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఐటీ లో మినహాయింపు ఏమైనా ఉందా?

జవాబు:   తీవ్ర రోగాల చికిత్స కై చేసిన వాస్తవ ఖర్చు లో 40,000రూ వరకు 80DDB కింద మినహాయింపు కలదు.దీని కోసం డాక్టర్ ధ్రువ పత్రం సమర్పించాలి.

207.  నేను అంతర. జిల్లా బదిలీల లో వచ్చాను.నా సీనియారిటీ కి రక్షణ ఉంటుందా?

జవాబు:  మీరు 610జీఓ ద్వారా వస్తే రక్షణ ఉంటుంది. సాధారణ అంతర్ జిల్లా బదిలీల లో వస్తే మాత్రం కొత్త జిల్లాలో చేరిన తేదీ నుంచి మాత్రమే సీనియారిటీ లెక్కించబడుతుంది.

208. నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే DSC లో సెలెక్ట్ అయ్యాము.ఒకే స్కూల్లో చేరాము.ఎవరు HM భాద్యతలు తీసుకోవాలి?

జవాబు:  మెరిట్ కమ్ రోస్టర్ లో ఎవరు ముందుంటే వారే సీనియర్. సీనియర్ ఐన టీచర్ HM గా చేయాలి.

209 .  17 ఇయర్స్ సర్వీస్ గల టీచర్ వైద్య కారణం పై PF లోను తీసుకున్నాడు.6 నెలలు గడిచింది.గృహ నిర్మాణం నిమిత్తం పార్ట్ ఫైనల్ తీసుకోవటానికి వీలుందా?

జవాబు:   మీ మొత్తాన్ని పార్ట్ ఫైనల్ కింద మార్చుకొని మాత్రమే 6 నెలల తరువాత పార్ట్ ఫైనల్ పొందే అవకాశం ఉంది.

210:  SGT నుంచి SA గా పదోన్నతి పొందటానికి 3 మేథోడాలజీని పరిగణనలోకి తీసుకుoటున్నారా??

జవాబు:  మెమో.434204 తేదీ:27.4.17 ప్రకారం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఐతే ఇటీవల విడుదలైన ఉత్తర్వులు ప్రకారం (R. C. NO.207 తేదీ:20.8.18) 3 మేథోడాలజీ ని పరిగణనలోకి తీసుకోవాలి.

211.   ప్రస్తుతం మెడికల్ రీ-అంబర్సుమెంట్ బిల్లులు ముందు ఎవరికి పంపాలి??

జవాబు:    ముందు చుట్టిగుంట, గుంటూరు లోని NTR వైద్య సేవ ట్రస్ట్ కి పంపాలి.

212:   EHS పై కంటి ఆపరేషన్ చేయించుకుంటే, హాస్పిటల్ వారికి ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుంది??

జవాబు:  26,000/- ఇస్తుంది.

213:   మా స్కూల్ లో రేషనలైజేషన్ లో పోస్టు పోతుంది. నేను.మరొక టీచర్ ఇద్దరం 9.11.98 జాయిన్ అయ్యాము. ఇపుడు మా ఇద్దరి లో ఎవరు జూనియర్??

జవాబు:   ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం ఎవరు జూనియర్??ఎవరు సీనియర్?? అనేది date of joining పై ఆధారపడి లేదు. కేవలం DSC రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తారు.1998 DSC రోస్టర్ కమ్ మెరిట్ లో ఎవరు జూనియర్ ఐతే,వారు రేషనలైజేషన్ లో వెళ్ళవలసి ఉంటుంది.

214:   అప్రంటీస్ కాలంలో EOL వాడుకోవచ్చా??  వాడుకుంటే ఇంక్రిమెంట్లు పోస్ట్ ఫోన్ అవుతాయా??

జవాబు:   అర్హత లేదు. FR(బి)ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నత చదువులు, వైద్య కారణాలపై వినియోగించుకున్న EOL కాలం ఇంక్రిమెంట్లు కి పరిగణింపబడుతుంది.

215 :   డైస్ నాన్ కాలం పెన్షన్ కి  ఎలిజిబుల్ అవుతుందా??

జవాబు:   FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, పెన్షన్ ప్రయోజనాలకు అర్హత గల సెలవుగా పరిగణించబడదు.

216 :  డైస్ నాన్ శిక్ష ను రద్దు లేదా మార్పు చేయించుకోవాలీ అంటే ఎవరికి అప్పీల్ చేసుకోవాలి??

జవాబు:   ఉత్తర్వులు ఇచ్చిన 90 రోజులు లోగా అప్పిలేట్ అథారిటీ కి అప్పీల్ చేసుకోవాలి.

217 :   ZPPF లోన్ తిరిగి చెల్లించకుండా ఉండాలంటే ఉద్యోగికి ఎంత సర్వీసు ఉండాలి??

జవాబు:   20 ఇయర్స్ సర్వీసు నిండితే లోన్ అమౌంట్ తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో మరియు ఇంటి కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయిన సందర్భంలో సరియైన పత్రాల ఆధారంగా 15 ఇయర్స్ సర్వీసు నిండిన ఉద్యోగి కూడా లోన్ తిరిగి చెల్లించకుండా ఉండవచ్చు.

218 :   ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో నుంచి మన అత్యవసరాలకు దాచుకున్న మొత్తంలో కొంత వెనక్కి లేదా అప్పుగా తీసుకవచ్చు కదాజాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్‌)లో ఇలా తీసు కోవడం వీలవుతుందా?   పదవీ విరమణ, అత్యవసరాలకు సంబంధించి రెండింటిలో ఏది మెరుగైనది??

జవాబు:  దీర్ఘకాలిక అవసరాల కంటే తక్షణ అవసరాలు, కోరికలు, కలల కోసం ఖర్చు పెట్టాలని చూడటం మానవ బలహీనత. పదవీ విరమణ చేశాక పింఛను అత్యవసరం. పింఛను కోసం మొదలు పెట్టిన దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను మధ్యలో తీసుకోకూడదనే లక్ష్యంతో ఎన్పీఎస్టైర్‌ 1 ఖాతాలో మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోకూడదనే నిబంధన విధించారు. ఇటీవల దీన్ని కొంత సడలించారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, గుండెపోటు, పక్షవాతం, ప్రమాదం వంటి ఆరోగ్య అవసరాలకు మన ఎన్పీఎస్నిల్వలో 25శాతం వెనక్కి తీసుకోవచ్చు.ఎన్పీఎస్ప్రారంభించిన మూడేళ్ల తర్వాత సదుపాయం లభిస్తుంది. పదవీ విరమణ చేసేలోగా మూడుసార్లు సదుపాయం వినియోగించుకోవచ్చు. పీపీఎఫ్లో వడ్డీ జనవరి నుంచి 7.6శాతం. ఎన్పీఎస్టైర్‌-1 ఈక్విటీలో గత ఐదేళ్ల రాబడి 14శాతం వరకూ ఉంది.ఇందులో ప్రభుత్వ బాండ్పథకంలో కూడా రాబడి 8.47% పైగానే ఉంది. సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, అదనంగా మరో రూ.50వేల పెట్టుబడి వరకూ ఎన్పీఎస్లో మదుపు చేసి, ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు. కాబట్టి, మీరు ఎన్పీఎస్ఎంచుకోవచ్చు.

219:  నేను 9.11.17 ఉద్యోగం లో చేరాను.నాకు వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ 9 నుండి ఇస్తారా?? లేక నవంబర్ 1 నుండి ఇస్తారా??

జవాబు:   జీఓ.133 , ఆర్ధిక ; తేదీ:13.5.76 ప్రకారం నియామకం తేదీ నెలలో తేదీన ఉన్నా, నెల మొదటి తేదీ నుండే వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చెయ్యాలి.

220 :  నేను sgt గా పనిచేస్తున్నాను.EOT, GOT పాస్ కాలేదు. నాకు 51 సంవత్సరంలు.నాకు ఇప్పుడు 24 ఇయర్స్ స్కేల్ ఇస్తారా??

జవాబు:  మీకు 50 ఇయర్స్ దాటినప్పటికీ 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వాలి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కావాలి.వాస్తవానికి PRC లో మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆర్ధిక శాఖ ఒప్పుకోలేదు.

221:   కారుణ్య నియామకం కింద నా కుమారుడు కి ఉద్యోగం ఇవ్వాలి అంటే నాకు ఎంత సర్వీస్ మిగిలి ఉండాలి??

జవాబు:  జీఓ.661, ఆర్ధిక : తేదీ:23.10.08 ప్రకారం అనారోగ్య కారణాలతో రిటైర్డ్ అయి, వారసుడు కి కారుణ్య నియామకం కావాలి అంటే, రిటైర్మెంట్ తేదీ నాటికి 5 ఇయర్స్ సర్వీస్ మిగిలి ఉండాలి.

222 : LFL HM పదోన్నతి పొందటానికి అర్హతలు కావాలి??

జవాబు:     సర్వీసు నిబంధనలు ప్రకారం ఇంటర్, డీ.ఎడ్ చాలు.డిగ్రీ,బీ.ఎడ్ ఉండవలసిన అవసరం లేదు.

223 :  నేను జీత నష్టం సెలవు పెట్టిన కారణంగా నా ఇంక్రిమెంట్ 29.1.17 కి మారింది.ఇపుడు నాకు ఇంక్రిమెంట్ జనవరి 29 ఇస్తారా?? లేక జనవరి 1 ఇస్తారా??

జవాబు:  మెమో.49643 ; ఆర్ధిక ; తేదీ:6.10.74 ప్రకారం అసాధారణ సెలవు కారణంగా వాయిదా పడిన ఇంక్రిమెంట్ ను , నెల మొదటి తేదీ నుంచే మంజూరు చేయాలి.అంటే జనవరి 1 నుంచే ఇస్తారు.

224:   జాతీయ పండుగల రోజు జెండా వందనం కి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా??

జవాబు:  సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం జెండా వందనం కి హజరు కాకపోతే జాతీయ జెండాను అగౌరవపరచినట్లుగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

225 :  స్థానికత దేని ఆధారంగా నిర్ణయిస్తారు??

జవాబు:  జీఓ.674 జీఏడీ: తేదీ:20.10.1975 రాష్టప్రతి ఉత్తర్వులలోని పేరాప్రకారం 4 నుంచి 10 తరగతి వరకు గల 7 ఇయర్స్ కాలంలో ఎక్కువ భాగం ఎక్కడ చదివితే జిల్లానే లోకల్ గా పరిగణింపబడుతుంది.

 

సందేహాలు - సమాధానాలు (226 - 250)

226:   నేను 1996 డిసెంబరు లో sgt గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం(ఇఓఎల్)సెలవు పెట్టాను.ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరు కి మార్చుకొనే అవకాశం లేదా??

జవాబు జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.

227 :  సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా??

జవాబుసస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు.

228  :  ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??

జవాబు FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

229:  భార్య ప్రసవించిన సందర్భంగా భర్త paternity లీవ్ ఎలా వాడుకోవాలి??

జవాబు Paternity Leave to Male Government Employees. (G.O.Ms.No.231 Dated: 16-9-2005)

The employees of Government of India can avail paternity leave either before 15 days or within a period of 6 months from the date of delivery. (Cir.Memo.No. 20129-C/454/FR.I/2010 Dated: 21-07-2010)

230 :   నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా?

జవాబుఇద్దరు జీవించి ఉన్న పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది. బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా? వచ్చిన తరువాతా? అనే దానితో నిమిత్తం లేదు. కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.

231 :  చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా?

జవాబు:   అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 సంవత్సరాలు నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి. అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.

232 : సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా?

జవాబు: FR-24 లో  "Increment should be drawn as a matter of course, unless it is withheld" అని ఉంది. క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.

233 :  అప్రంటీస్ కాలంలో EOL వాడుకోవచ్చా??వాడుకుంటే ఇంక్రిమెంట్లు పోస్ట్ ఫోన్ అవుతాయా??

జవాబుఅర్హత లేదు. FR(బి)ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నత చదువులు, వైద్య కారణాలపై వినియోగించుకున్న EOL కాలం ఇంక్రిమెంట్లు కి పరిగణింపబడుతుంది

234:  డైస్ నాన్ శిక్ష ను రద్దు లేదా మార్పు చేయించుకోవాలీ అంటే ఎవరికి అప్పీల్ చేసుకోవాలి??

జవాబు ఉత్తర్వులు ఇచ్చిన 90 రోజులు లోగా అప్పిలేట్ అథారిటీ కి అప్పీల్ చేసుకోవాలి.

260 :  ZPPF లోన్ తిరిగి చెల్లించకుండా ఉండాలంటే ఉద్యోగికి ఎంత సర్వీసు ఉండాలి??

జవాబు20 ఇయర్స్ సర్వీసు నిండితే లోన్ అమౌంట్ తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో మరియు ఇంటి కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయిన సందర్భంలో సరియైన పత్రాల ఆధారంగా 15 ఇయర్స్ సర్వీసు నిండిన ఉద్యోగి కూడా లోన్ తిరిగి చెల్లించకుండా ఉండవచ్చు.

235 :  ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో నుంచి మన అత్యవసరాలకు దాచుకున్న మొత్తంలో కొంత వెనక్కి లేదా అప్పుగా తీసుకవచ్చు కదా! జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్‌)లో ఇలా తీసు కోవడం వీలవుతుందా? పదవీ విరమణ, అత్యవసరాలకు సంబంధించి రెండింటిలో ఏది మెరుగైనది??

జవాబు:   దీర్ఘకాలిక అవసరాల కంటే తక్షణ అవసరాలు, కోరికలు, కలల కోసం ఖర్చు పెట్టాలని చూడటం మానవ బలహీనత. పదవీ విరమణ చేశాక పింఛను అత్యవసరం. పింఛను కోసం మొదలు పెట్టిన దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను మధ్యలో తీసుకోకూడదనే లక్ష్యంతో ఎన్పీఎస్టైర్‌ 1 ఖాతాలో మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోకూడదనే నిబంధన విధించారు. ఇటీవల దీన్ని కొంత సడలించారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, గుండెపోటు, పక్షవాతం, ప్రమాదం వంటి ఆరోగ్య అవసరాలకు మన ఎన్పీఎస్నిల్వలో 25శాతం వెనక్కి తీసుకోవచ్చు.ఎన్పీఎస్ప్రారంభించిన మూడేళ్ల తర్వాత సదుపాయం లభిస్తుంది. పదవీ విరమణ చేసేలోగా మూడుసార్లు సదుపాయం వినియోగించుకోవచ్చు. పీపీఎఫ్లో వడ్డీ జనవరి నుంచి 7.6శాతం. ఎన్పీఎస్టైర్‌-1 ఈక్విటీలో గత ఐదేళ్ల రాబడి 14శాతం వరకూ ఉంది.ఇందులో ప్రభుత్వ బాండ్పథకంలో కూడా రాబడి 8.47% పైగానే ఉంది. సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, అదనంగా మరో రూ.50వేల పెట్టుబడి వరకూ ఎన్పీఎస్లో మదుపు చేసి, ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు. కాబట్టి, మీరు  ఎన్పీఎస్ఎంచుకోవచ్చు.

236:    మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??

జవాబుసీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

237:  FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??

జవాబుFR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.

238 :  నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

జవాబు:  జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి

239:   నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము. ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??

జవాబు:   SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

240 .   PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??

జవాబు PF నిబంధనలు 15 ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.

241:   ఒక టీచర్ 9 రోజులు APOSS పరీక్షల కోసం, మరియు 26 రోజులు SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం వేసవి సెలవులలో హాజరు అయ్యాడు.ఇపుడు ఆతనికి 35 ELs జమచేయబడతాయా??

జవాబుమొత్తం కాలాన్ని కలిపి దామాషా ELs జమ చేయవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం జమ అయ్యే 6 రోజులు మీరు వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కంటే తగ్గిన యెడల పూర్తి సంపాధిత సెలవు 24 రోజులు జమ చేయబడుతుంది.ఇక్కడ 35 రోజులు పనిచేశాడు.14 రోజులే వేసవి సెలవులు ఉపయోగించుకొన్నందున అతనికి 24 రోజుల సంపాధిత సెలవు జమచేయవలసి ఉంటుంది.

242 :   నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను.ఇంటర్,డిగ్రీ,హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు.HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు.ఎందుకని??

జవాబు:   మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.

243 :    ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా??

జవాబుఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు,ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఇవ్వండి,అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.

244 :     నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను.నాకు పెన్షన్ ఎంత వస్తుంది??

జవాబుచివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.

245 :  నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది??

జవాబుమెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారం మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. తర్వాత ఇక చేర్చరు.

246  :  మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?*

సమాధానం:  రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది

 

సందేహాలు - సమాధానాలు (251 -      )

251 ప్రశ్న : అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా?

జవాబు :జి.ఓ.నం.28, తేదీ : 09.03.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి.

252 ప్రశ్న :నా వయస్సు 57 సం. నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా?

జవాబు :జి.ఓ.నం. 36, తేదీ : 05.03.2016 ప్రకారం 55 సం. తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు. బాండ్ కూడా ఇవ్వరు.

253 ప్రశ్న :చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరంలో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా?

జవాబు :జి.ఓ.నం. 132, తేదీ :06.07.2016 ప్రకారం లీవు మూడు సార్లు తక్కువ కాకుండా వాడుకోవాలని మాత్రమే ఉన్నది.

254 ప్రశ్న :నేను మునిసిపాలిటీలో టీచర్ గా పని చేస్తున్నాను. నేను ఏఏ టెస్టులు పాస్ కావాలి?

జవాబు :మునిసిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 07.12.2016 నాటికి H.M. Account Test పాస్ అయి ఉంటే 3 సం. వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు. తదుపరి S.A.లు 12 సం. స్కేల్ కొరకు, SGT లు 24 సం. స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి.

255 ప్రశ్న :తల్లిపేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా?

జవాబు :విద్యాశాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ:14.09.2010 ప్రకారం తల్లిపేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి.

256 ప్రశ్న :నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను. నా వేతనం FR--22 (బి) ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా?

జవాబు :లేదు. మీకు FR--22 ఎ (i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతుంది.

257 ప్రశ్న :మొదటిబిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు. రెండవబిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను. ప్రస్తుతం మూడవబిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా?

జవాబు :అవకాశం లేదు. జి.ఓ.నం.231, తేదీ : 16.09.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

258 ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది? ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జవాబు  20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.

( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980 ) రూల్ : 42,43