APTF - ఉద్యమ చరిత్ర

 

1939    ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మలబారు ఉపాధ్యాయులు సాగించిన చారిత్రక సమ్మె. 

1944    ఏప్రిల్ 16-సత్యపుత్రశర్మ,రామజోగారావు, మాణిక్యాంబ గార్ల నాయకత్వంలో తూర్పు గోదావరి జిల్లా 

            తాపేశ్వరంలో ప్రాథమికోపాధ్యాయ మహాసభ నిర్వహణ, రాష్ట్రస్థాయిలో ప్రాథమి కోపాధ్యాయసంఘస్థాపన. 

1944   నవంబరు-ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి 'స్టాటం'చే రాష్ట్రస్థాయి 

            ఉపాధ్యాయ సంఘం రద్దు ఉత్తర్వు, ఫలితంగా సంఘ నిర్మాణం స్థంభన.

1947    ఏప్రిల్ 19-20 : ఆంధ్రరాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ పునరుద్దరణ - గుంటూరులో

            ద్వితీయమహాసభ- రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా చెన్నుపాటి లక్ష్మయ్య, 

            ప్రధానకార్యదర్శిగా పి.రామసుబ్బయ్య ఎన్నిక.

1947   జూన్ 25 : ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాపిత సమ్మెకు పిలుపు సమ్మె ప్రారంభం కాకమునుపే 

           ప్రభుత్వందిగివచ్చి జూన్, 5వ తేదీన జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ. 

              ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తొలిసారిగాటైం స్కేలు వర్తింపు

1948   ఫిబ్రవరి 20- ఆంధ్రరాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ తృతీయ మహాసభ - 

           విజయవాడలో ఫెడరేషన్ అధికార వాణిగా 'ఉపాధ్యాయ' తొలి సంచిక ఆవిష్కరణ. 

1948   ఫిబ్రవరి 20- చెన్నుపాటి రాష్ట్ర అధ్యక్షులుగా, ఆర్.కె. కంబగిరిరాజు రాష్ట్రప్రధానకార్యదర్శిగా ఎన్నిక.

1949    నర్సరావుపేటలో ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం. రాష్ట్ర అధ్యక్షులుగా చెన్నుపాటి, ప్రధాన కార్య దర్శిగా

            సింగరాజు రామకృష్ణయ్య ఎన్నిక.

1951    అక్టోబరు 19 - సంఘస్థాపనా హక్కును నిరాకరించిన 416 జీ.వో. రద్దుకు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి

           సింగరాజు రామకృష్ణయ్య మద్రాసు హైకోర్టులో ప్రభుత్వంపై దాఖలు చేసిన దావాపై 

           రాజ్యాంగం ప్రసాదిం చిన ప్రాథమిక పౌర హక్కులకు ఆ జీ.వో. విరుద్ధమని ప్రకటిస్తూ, 

           రద్దు పరుస్తూ, మద్రాసు హైకోర్టు యిచ్చినచారిత్రక తీర్పు.

1952   జూలై-ఉపాధ్యాయ నియోజక వర్గాలకు మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో

           ఒక స్థానానికి ఫెడరేషన్  అభ్యర్ధిగా సింగరాజు రామకృష్ణయ్య అఖండ విజయం. 

1953   ఏప్రియల్ 23, 24, 25- ఫెడరేషన్ చతుర్థ మహాసభ కాకినాడలో ఫెడరేషన్ ఆశయాలు,

           ఆదర్శాలు, కార్యక్రమాలకు సంబంధించిన అంశాలకు శాస్త్రీయమూ, ప్రామాణికమూ

           అయిన పాలసీ స్టేట్ మెంట్ కురూపకల్పన చేసిన చారిత్రాత్మక మహాసభలివి.

1953   మే       - కుప్పుస్వామి కమిటీ రిపోర్టు 

1953   జూన్    - రాజాజీ ప్రభుత్వపు ఒంటిపూట బడుల పథకం -ఫెడరేషన్ ప్రతిఘటన,

           ప్రజాసమీకరణ-శాసన సభలో  రాజాజీ ప్రభుత్వం ఓటమి.. 

1953   జూలై  21,24 - వియన్నాలోజరిగిన ప్రథమప్రపంచఉపాధ్యాయ ఫెడరేషన్ మహాసభకు

           ఫెడరేషన్ ప్రతినిధిగాసింగరాజుకు ఆహ్వానం-పాస్ పోర్టు నిరాకరణ-యీచర్యకు మహాసభ ఖండన

           -పార్లమెంట్ లో ప్రస్తావన

1954    మే 5  , నెల్లూరులో ఫెడరేషన్ అయిదవ మహాసభల నిర్వహణ,

1955    నెల్లూరు, విశాఖజిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనం. 

1956    ఫిబ్రవరి 22 , విద్యా నిబంధన 154 ప్రకారం విచారణ సైతం లేకుండా ఉపాధ్యాయుల 

            సర్టిఫికెట్లనుసస్పెండ్చేయరాదని నంద్యాల మున్సిఫ్ కోర్టు తీర్పు..

1956    మే19,20,21- ఫెడరేషన్ ఆరవ మహాసభ - గుంటూరులో. 

1957    ఆగస్టు-5 ,టి.ఎ. సెంటర్లపై విద్యాధికార్ల పెత్తనం చెల్ల దంటూ 478 జీ.వో. లోని 3,4 సెక్షన్లు 

            రాజ్యాంగ విరుద్ధమని రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు. 

1958       జనవరి 11 - రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ‘జాయింట్ కౌన్సిల్' ఏర్పాటు.

 

1958 జూలై 20 ఆంధ్ర ప్రాంతానికి కేటాయించిన నాలుగుఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఫెడరేషన్ అభ్యర్థులుగా

             సింగరాజు రామకృష్ణయ్య, పి. శ్రీ రామమూర్తి ఎన్నిక.

1958    నవంబరు 30, డిసెంబరు 1 సమితి, జిల్లా పరిషత్తులకు పాఠశాలల పై అధికార ప్రాప్తి. 

1959   అక్టోబరు-1    కడప, గుంటూరు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలలో 

            ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనం ప్రారంభం. 

1959    నవంబరు-1 పంచాయితీ రాజ్యవ్యవస్థ ప్రారంభం. 

1961    ఏప్రిల్  - త్రివిధ సౌకర్యాల (పెన్షన్-ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ బెనిఫిట్ స్కీము) ప్రకటన

1962    మే 28 నుండి 30-ఫెడరేషన్ ఏడవ మహాసభ ఏలూరులో పదవీ విరమణ

            55 నుండి 56 సం.నకు పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్.బి.పి. పట్టాభి రామారావు ప్రకటన. 

1962    జూలై     సర్కారు జిల్లాలకు కేటాయించిన నాలుగు ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఫెడరేషన్ 

            మూడు స్థానాలను గెలుచుకుంది. గెలిచిన అభ్యర్థులు చెన్నుపాటి లక్ష్మయ్య, 

            పి.శ్రీరామమూర్తి, ఎస్.టి.పి. కూర్మాచార్యులు.

1964   జూలై14  రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన రెండు ఉపాధ్యాయనియోజకవర్గాలకు 

           ఫెడరేషన్ అభ్యర్థులు. 

1965    మే 20, 21, 22 ఫెడరేషన్ ఎనిమిదవ మహాసభలు - తిరుపతిలో.. 

1965     ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ (రిజిష్టర్లు) పేరుతో పోటీ సంఘస్థాపన. 

1968    జూలై 7    సర్కారు జిల్లాలకు నాలుగు ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాలకు జరిగిన ఎన్నికలలో

            విజయరామరాజు ప్రభృతులు ఫెడరేషన్ మెజారిటీ నిర్ణయానికి, క్రమశిక్షణకు కట్టుబడక

            వ్యతిరేకించినందుకుచెన్నుపాటి లక్ష్మయ్య, పి.వి.సుబ్బరాజు, యు.ఎన్. దాసుగార్ల ఓటమి. 

1968   ఆగస్టు18-ఫెడరేషన్ నిర్ణయాలకు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరించిన

           విజయరామరాజు ప్రభృతుల సస్పెన్షన్. 

1968    డిసెంబరు 9, ఉపాధ్యాయ ఉద్యమ పితామహులు చెన్నుపాటి లక్ష్మయ్య నిర్యాణం. 

            ఎం. నరసింహస్వామితాత్కాలిక రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక. 

1969    జూన్ 3, 4, 5- ఫెడరేషన్ తొమ్మిదవ మహాసభలు- గుడివాడలో ఎం.బాలకృష్ణమ్మ అధ్యక్షులుగా, 

            సింగరాజు రామకృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక.. 

1970   ఏప్రియల్ 27 ,ఉపాధ్యాయుల వేతన సవరణ. 

1970   జూలై-తూర్పురాయలసీమ టీచర్స్ నియోజకవర్గం నుండి సింగరాజుతిరిగిఎం.ఎల్.సిగా ఎన్నిక. 

1971   ఏప్రిల్ 5-రాష్ట్ర ఉపాధ్యాయుల, ఎన్.జీ.వోల 56 రోజుల చారిత్రక సమ్మె వైఫల్యానికి నిరసనగా

            కార్యాచరణకమిటీకి సింగరాజు రాజీనామా : సమ్మె విరమణ పట్ల 

            ఫెడరేషన్ వైఖరి విస్పష్టం చేస్తూ 'సమ్మె సమీక్ష' పుస్తకప్రచురణ

1972   ఫిబ్రవరి 16-ఏపిటియఫ్ ఆందోళనా ఫలితంగా సమస్యల పరిష్కారానికి కో-ఆర్డినేషన్ 

           సమావేశాలు ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు. 

1972    మే15, 16, 17, 18 - ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ 10వ మహాసభలను,

                   సంస్థ -ఉపాధ్యాయ రజతోత్సవాలను విజయవాడలో వైభవంగా నిర్వహణ, 

                  నిబంధనావళి సవరణ ద్వారా ప్రాథమిక మొదలు సెకండరీ, కాలేజి, యూనివర్శిటీ స్థాయి

                వరకూ గల ఉపాధ్యాయులందరికీ ఫెడరేషన్ అధికారరీత్యా ప్రవేశం కల్పించింది.

                  తద్వారా ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏ.పి.ఇ.టి.యఫ్) 

            ఆంధ్రప్రదేశ్ టీచర్స్  ఫెడరేషన్ (ఏ.పి.టి.యఫ్)గా మార్పు . 

1973    ఏప్రియల్-లిబరలైజ్ పెన్షన్ పథకం ఉపాధ్యాయులకు వర్తింపు. 

1974    ఏప్రిల్-పే కమిటీ రిపోర్టు/పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల 

            సెలక్షన్ గ్రేడ్, డి. ఏ మెర్జెడ్ స్కేళ్లు అమలు.జూలై- సర్కారు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ 

            ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. బాల కృష్ణమ్మ, ఏ.పి.టి.యఫ్. బలపరిచిన అభ్యర్థులు 

            దండు శివరామరాజు, ఎం.జె. మాణిక్యారావు ఎన్నిక.

1974   ఆగస్టు10 - ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యు.టి.యఫ్) పేరుతో 

           ఏ.పి.టి.యఫ్. నుండి చీలిన వారిచే  మరో సంఘస్థాపన  

1974   సెప్టెంబర్ 27 - డి.ఏ. మెర్టెడ్ స్కేలు మంజూరు. 

1975     మే 26, 27, 28 అనంతపురం పట్టణంలో ఏ.పి. టి.యఫ్. 11వ విద్యావైజ్ఞానిక మహాసభలు. 

             ఇవి రాయలసీమ జిల్లాల్లో విస్తరణకు తోడ్పడ్డాయి. 

1975    డిసెంబర్ 26–31 కంబాయిలో అఖిల భారత విద్యా సంస్థల సమాఖ్య స్వర్ణోత్సవాలు. 

1976    జులై 4- రాయలసీమ టీచర్స్ నియోజకవర్గ ఎన్నికలలో ఫెడరేషన్ అభ్యర్థులు శింగరాజు,

            ఆర్.వెంక ట్రాముడు ఓటమి.

1976     జూలై-జాయింట్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఏక్షన్ (జె.సి.టి.ఏ) పేరుతో పనిదినాల, పనిగంటల పెంపుదల

            సమస్యపై ఉపాధ్యాయ సంఘాల సమైక్య పోరాట వేదిక ఏర్పాటు. 

1976     డిసెంబరు 15 : ప్రభుత్వంతో చర్చలు - పెంచిన పనిదినాల తగ్గింపు 

1976     డిసెంబరు 26-31 :ఐఫియా 52వ మహాసభలు-ఢిల్లీలో – ఏ.పి.టి.యఫ్ తరపున వెయ్యిమంది పాల్గొన్నారు.

1977     మే-ఏ.పి.టి.యఫ్. తీవ్ర కృషి, చొరవతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) స్థాపన -

            జె.సి.టి.ఎ. రద్దు.

1977    సెప్టెంబరు - అనకాపల్లిలో రాష్ట్ర అధ్యయన తరగతులు. 

1978    ఏప్రియల్ - వేతన స్కేళ్ళ రివిజన్.. 

1979    మార్చి 19న ఫ్యాప్టో చైర్మన్ గా సింగరాజు ఎన్నిక. 

1979    మే 28 నుండి 31: విజయనగరం పట్టణంలో ఏ.పి.టి.యఫ్. 12వ విద్యావైజ్ఞానిక మహాసభలు. 

1980    జూలై6-సర్కారు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలలో ఎం.బాలకృష్ణమ్మ తిరిగిఎన్నిక- మిగతా 3నియోజక

            వర్గాల్లో ఏ.పి.టి.యఫ్. అభ్యర్థులు పిళ్ళా సుబ్బారావు, మర్రివాడగోపాలకృష్ణమూర్తి, యన్.సుబ్బారావు ఓటమి.

1981     జూన్-పాత అగ్రిమెంటులోని అంశాలన్నింటి సారాంశంగా ఏకవాక్య అగ్రిమెంటుతో ఎయిడెడ్ టీచర్లకు

             డైరెక్టు పేమెంట్ పద్ధతి అమలు.

1981     ఏ.పి.టి.యఫ్. అధ్యక్షులుగా యు.ఎన్.దాస్, ప్రధాన కార్యదర్శిగా సింగరాజు ఎన్నిక.

1981     సమగ్ర విద్యాబిల్లుకు అసెంబ్లీ ఆమోదం.

1982     జూలై4-రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం నుండి రాచంరెడ్డి

           వెంకట్రాముడు ఎన్నిక. తూర్పు నియోజకవర్గంలో ఏ.పి.టి.యఫ్. అభ్యర్థి ఇ లక్ష్మణరావు ఓటమి.

1982     అక్టోబరు 7-ఆర్ధికమంత్రితో రీ గ్రూపింగ్ స్కేళ్ళకు ఒప్పందం.

1982     డిసెంబరు 17- రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమ్మె రీ గ్రూపింగ్ స్కేళ్ళ జీ.వో. విడుదల.

1983     ఫిబ్రవరి 13-ఫ్యాప్టో సెక్రటరీ జనరల్గా ఎం. బాలకృష్ణమ్మ..

1983     ఫిబ్రవరి 6-ఏ.పి.టి.యఫ్. నిర్మాణం తెలంగాణా ప్రాంతానికి విస్తరణ ప్రారంభం.

1983     జూన్ 15-19 ఏ.పి.టి.యఫ్. ఆధ్వర్యాన ఐఫియా. మహాసభలు విశాఖపట్నంలో నిర్వహణ,

1984     మార్చి 6 నుండి 19 వరకు ఫ్యాప్టో సమ్మె-ఒప్పందం.

1984     నవంబరు 11 -అధ్యక్షులుగా ఆర్. రవీంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సింగరాజు ఎన్నిక,

1985     ఫిబ్రవరి 4 నుండి 13-సెక్రటేరియట్ వద్ద ఏ.పి.టి. యఫ్, రిలే నిరాహారదీక్షలు,

1985     ఫిబ్రవరి 14-ఏ.పి.టియఫ్. పక్షాన 'ఛలో రాజ్ భవన్' మహాప్రదర్శన-లక్షా పాతిక వేల సంతకాలతో

              గవర్నర్ కు మహా విజ్ఞాపన పత్రం సమర్పణ.

1986     “రాష్ట్ర వ్యాపిత ఉపాధ్యాయుల సమ్మె” మార్చి 6 నుండి 24 వరకు సమ్మె-అర్దరాత్రి ఫ్యాప్టో సమ్మె విరమణ

                    ఫలితంగా ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు..

1986     మార్చి 27-సమ్మె విరమణ పద్ధతికి నిరసనగా ఫ్యాప్టో కార్యదర్శి పదవికి ఏపిటియఫ్. అధ్యక్షులు రాజీనామా.

1986     జూలై14- పేకమీషన్ డి.ఏ. మెర్టెడ్ స్కేల్స్ పై నివేదిక సమర్పణ - యధాతథంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం.

1986     ఆగస్టు 22 నుండి 24 ఏ.పి.టి.యఫ్. 13వ మహాసభలు కరీంనగర్ లో నిర్వహణ, విద్యను

                    ప్రాథమికహక్కుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం. 

1987     మే-కొత్తపట్నంలో అధ్యయన తరగతులు. 

1987     జూన్9-విజయవాడలో ఏ.పి.టి.యఫ్. నలభై వసంతాల ఉత్సవాల ప్రారంభ సభలు. 

1987     11,12 జూలై-ఆర్థిక అరాచకం, క్రమశిక్షణా రాహిత్యం, సంఘ విద్రోహ కార్యకలాపాల కారణంగా

                    ఏ.పి.టి.యఫ్. మాజీ అధ్యక్షులు, మాజీ ఎం.ఎల్.సి. అయిన

                    మార్పు బాలకృష్ణమ్మప్రాథమిక సభ్యత్వం రద్దు. 

1987     డిసెంబరు 3-దీర్ఘకాల అపరిష్కృతసమస్యల పరిష్కారానికి రాష్ట్ర సచివాలయం ముందు ఏపిటియఫ్. ధర్నా 

1987     డిసెంబర్ - ఆర్. రవీందర్రెడ్డి ఫ్యాప్టో సెక్రటరీ జనరల్గా ఎన్నిక. 

1988     ఫిబ్రవరి 13, 14: హైదరాబాదులో ఏ.పి.టి.యఫ్. 40 వసంతాల ముగింపు ఉత్సవాలు. 

1988     నవంబరు 12- విజయవాడలో ‘ఉపాధ్యాయ’ 40 వసంతాల ఉత్సవ సభలు. 

1988     డిసెంబర్ 15 - ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంయుక్త కార్యాచరణ సమితి (జె.ఎ.సి.) ఆవిర్భావం. 

1989     మార్చి 16-జె.ఎ.సి. పిలుపు మేరకు 2 లక్షలకు పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు 

           ఛలోఅసెంబ్లీ' ప్రదర్శన.. 

1989     అక్టోబరు 22-ఉద్యోగుల, ఉపాధ్యాయుల కార్మికుల 18 సమస్యలపై ప్రభుత్వం జె.ఎ.సితో ఒప్పందం. 

1990     జూన్ 10- ఏ.పి.టి.యఫ్. రాష్ట్ర కార్యవర్గం 30 ప్రధాన సమస్యలపై త్రిదశ ఆందోళనా

                     కార్యక్రమానికిపిలుపు. జూలై 20న మండల పట్టణ కేంద్రాలలో, 

                    ఆగస్టు 8న జిల్లా కేంద్రాలలో ధర్నాలు, సెప్టెంబరు 5నహైదరాబాదులో నిరసన ప్రదర్శన. 

1991     మార్చి 10- ఏ.పి.టి.యఫ్. అధ్యక్షులుగా ఎ. నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సింగరాజు ఎన్నిక. 

1991     మే 4, 5, 6-సామాజిక సంక్షోభం-విద్యావిధానం' ఏ.పి.టి.యఫ్. 14వ విద్యా వైజ్ఞానిక మహాసభలు 

           ఒంగోలులో నిర్వహణ. 

1991         ఆగస్టు 7 నుండి 11-హైదరాబాదులో 12 నుండి 16 విజయవాడలో ఆపరేషన్ బ్లాక్ బోర్డు

                      పథకంలోభాగంగా కెనడియన్ టీచర్స్ ఫెడరేషన్, 

                    ఐఫియా ఆర్థిక సహాకారంతో ఏ.పి.టి.యఫ్.  నిర్వహణ. 

1992     ఫిబ్రవరి 24- పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం లోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి

           ఏ.పి.టి.యఫ్. పక్షాన ధర్నా 

1992     ఫిబ్రవరి 25 నుండి ఏప్రియల్ 3 వరకు 39 రోజులపాటు ఉపాధ్యాయ సమస్యల 

                పరిష్కారం పట్ల ప్రభుత్వనిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా సచివాలయంముందు రిలే నిరాహారదీక్షలు.

                 ఏపిటియఫ్. ప్రతినిధులతోచర్చలుఅంగీకరించిన 12 సమస్యలపై

                 3.4.1992న మినిట్స్ కాపీ జారీ ఫలితంగా రిలే నిరాహారదీక్షల విరమణ. 

1992     ఏప్రిల్ 12- ఫ్యాప్టో సెక్రటరీ జనరల్గా ఏ.పి.టి. యఫ్. అధ్యక్షులు ఏ. నరసింహారెడ్డి ఎన్నిక. 

1992     జూన్ 6,7 - ఏ.పి.టి.యఫ్, జనరల్ కౌన్సిల్ నిర్వహణ - ఏ.పి.టి.యఫ్. ప్రధాన కార్యదర్శిగా

                 43 సంవత్సరాలు ఎనలేని సేవచేసిన ఉద్యమ రథసారథి సింగరాజు రామకృష్ణయ్య 

                    తమ 82వ ఏట స్వచ్ఛందంగా పదవీవిరమణ - రాష్ట్ర అధ్యక్షులుగా ఎ. నర సింహారెడ్డి, 

                    రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్. పరమేశ్వర రావు ఎన్నికలు

1992     సెప్టెంబర్ 21- అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు విద్యారంగ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా

            ఏ.పి.టి.యఫ్. పక్షాన ధర్నా. 

1993     మార్చి 5 నుండి నిరవధిక సమ్మె ఫ్యాప్టో-జాక్తా యిచ్చిన పిలుపుతో ప్రభుత్వంతో చర్చలు జరిగి-

                    వాటిపరిష్కారానికి ఒప్పందం ఆమోదం, సమ్మె ప్రతిపాదన విరమణ, 

1993     మే 20-1993- పి.ఆర్.సి. సవరణ వేతన స్కేళ్ళు ప్రకటన.. 1993 నవంబరు 22-సమస్యల

                 పరిష్కారానికి ఏ.పి.టి.యఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి విజ్ఞాపనపత్రం 

                  1994 ఫిబ్రవరి 18న జిల్లా కలెక్టరేట్ల ఎదుట జిల్లాశాఖల ఆధ్వర్యంలో ధర్నా..

1994     జూన్ 4, 5 - తూ.గో.జిల్లా మండపేటలో ఫెడరేషన్ అవతరణోత్సవ సభలు.

                 'సామాజిక ప్రగతికి విద్య ప్రధాన చర్చనీయాంశంగా విద్యా సదస్సు నిర్వహణ.

                     సింగరాజు రామకృష్ణయ్య, పి. మాణిక్యాంబ గార్లకు సన్మానం, సింగరాజు గార్కి పర్సు బహూకరణ.

1995     ఏప్రిల్ 22- ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాలలో ఏ.పి.టి.యఫ్. ర్యాలీ.

1995     గుర్తింపు కలిగిన సంఘాల ఆధ్వర్యంలో సి.సి. ఆర్. టి.యు. ఏర్పాటు.

                    ఫ్యాప్టో ఐక్య ఉద్యమానికి విఘాతం,పాలకుల విభజించు పాలించు సూత్రానికి తోడ్పాటు. 

1995     జూలై 31- విద్యా బిల్లు నుండి విద్య-ఉపాధ్యాయ వ్యతిరేకమైన క్లాజుల ఉపసంహరణకు, 

                    అంగీకరించినఅంశాలపైన ఉత్తర్వుల జారీకి ఫ్యాప్టో ఆధ్వర్యాన కలెక్టరేట్ల ముందు ధర్నా 

1995     అక్టోబరు 4- హైద్రాబాద్లో సచివాలయం ముందు ఫ్యాప్టో దర్నా.. 

1995     నవంబరు-ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘ భవనాల నిర్మాణాలకు అప్పుగా మంజూరు చేసిన 

                    ఉత్తర్వు,సస్పెన్షన్, రూ. 10/-లు చొప్పున వసూళ్ళను నిలుపు దల చేస్తూ హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు

1996     ఫిబ్రవరి 16- రాజధానిలో రాష్ట్ర సచివాలయం వద్ద ఫ్యాప్టో పికెటింగ్ 

1996     మార్చి 6- రాజధానిలో ఫ్యాప్టో ర్యాలీ. 

1996     జూన్ - ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ నిధి నుండి అప్పు తీసుకున్నవారే చెల్లించాలి, 

                   హైకోర్టుసంచలనాత్మక తీర్పు. 

1996         జూన్-పోటీ ఏ.పి.టి.యఫ్. నుండి జి. సింహాద్రప్పడు ఆర్. అప్పయ్యల నాయకత్వాన     

                    విశాఖ, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలు పూర్తిగాను, శ్రీకాకుళం, 

                    విజయనగరం జిల్లాల్లో పాక్షికంగాను, మాతృసంస్థలో విలీనం. 

1996     జూలై 22- సమస్యల సాధనకు మండల, పట్టణ నగర కేంద్రాలలో ఫ్యాప్టో దర్నా, 

1996     సెప్టెంబరు 5- జిల్లా కేంద్రాలలో ఫ్యాప్టో పక్షాన ఉపాధ్యాయ దినోత్సవ బహిష్కరణ-ర్యాలీ. 

1996     అక్టోబరు-టెను స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ -స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంపుదల. 

1996     డిసెంబర్ 1న హైద్రాబాద్ లో ఏ.పి.టి.యఫ్. ఆధ్వ ర్యంలో ‘విద్యా ప్రమాణాల పెంపుదల-కర్తవ్యాలు”

                    అంశంపై రాష్ట్ర సెమినార్. 

1997     ఫిబ్రవరి 2న జిల్లా కేంద్రాలలో 10 ప్రధాన సమస్యల పరిష్కారమునకు ఏ.పి.టి.యఫ్. ధర్నా. 

1997     మార్చి 12న జె.ఏ.సి. ఆధ్వర్యంలో తాలూకా, జిల్లా, రాష్ట్రరాజధానిలో ధర్నా,     

                    నాలుగుసమస్యలు పరిష్కారంఉత్తర్వుల జారీ. 

1997     జూన్ 3న ఉపాధ్యాయ సంఘాలతో 44 సమస్యలపై గిరిజన సంక్షేమశాఖామాత్యులు

                 జి.నగేష్ ఆధ్వర్యంలోచర్చలు. 

1997     జూలై11,12,13 తేదీలందు విజయవాడలో ఏ.పి. టి.యఫ్. ఉపాధ్యాయ స్వర్ణోత్సవ 

                   మరియు 15వమహాసభలు -బ్రహ్మాండమైన ఊరేగింపు - అపూర్వ రీతిలో జయప్రదం- 

                    ఏ.పి.టి.యఫ్. ఉపాధ్యాయ,సావనీర్లు విడుదల.. 

1997     అక్టోబరు 3న సెక్రటేరియట్ ఎదుట ఫ్యాప్టో పికెటింగ్, విచక్షణారహితంగా సాగిన ఉపాధ్యాయులఅరెస్టులు- 

                       ప్రభుత్వ దమనకాండ. 

1997     డిసెంబర్ 4న జె.ఎ.సి. నాయకులతో చర్చలు, 8 సమస్యల పైన ఉత్తర్వులు జారీచేయటానికి

            19 సమస్యలపైన చర్చలకు అంగీకారం, సమ్మె ప్రతిపాదన విరమణ, 1997 డిసెంబర్ 5 నుండి

             ఫ్యాప్టో నిరవధిక నిరాహారదీక్షలు విద్యామంత్రి హామీతో 09-12-97న విరమణ. 

1997     డిసెంబర్ 12న ఏ.పి.టి.యఫ్.కు గుర్తింపు తదితర సమస్యల పరిష్కారానికి హైదరాబాదులో 

            వేలాదిమందిఉపాధ్యాయులతో ధర్నా. 

1998     మార్చి 3న విద్యాశాఖలో పేరుకుపోతున్న సమస్యల సాధనకు హైదరాబాద్లో ఏ.పి.టి.యఫ్. ధర్నా, 1

1998     మే 13న ఏ.పి.టి.యఫ్. పక్షాన పీ.ఆర్.సి.కి మెమో రాండం సమర్పణ.

1998     మే 26న కాబినెట్ సబ్ కమిటీతో 22 సమస్యలపై ఫ్యాప్టో చర్చలు.

1998     జూలై 4న హైద్రాబాద్లో వందలాది మంది ఉపాధ్యాయులతో ఫ్యాప్టో ధర్నా

1998     జూలై 20 నుండి 25 వరకు పాత తాలూకా కేంద్రాల్లో ఏ.పి.టి.యఫ్. ధర్నా

1998     జూలై 27న ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, నెలనెలా సకాలంలో 

            వేతనాలుచెల్లించాలని హైదరాబాద్లో ఎయిడెడ్ విద్యాసంస్థల ఐక్యకార్యాచరణ సమితి (ఏసిఎఇఓ) భారీ ప్రదర్శన. 

1998     సెప్టెంబర్ 9న ఎసిఏఇఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద పికెటింగ్. 

1998     సెప్టెంబర్ 23న 17ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి:ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. 

1998     అక్టోబరు 7న లక్షమంది ఉపాధ్యాయులతో మండల కేంద్రాలలో పోరాట సమతి ధర్నా. 

1998     క్టోబరు 15న 20 వేల మంది ఉపాధ్యాయులతో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో

           హైద్రాబాద్ లో పికెటింగ్, 

1998     నవంబర్ 3 నుండి పోరాట సమితి నాయకత్వంలో సమ్మె- 8 డిమాండ్లపై క్యాబినెట్ సబ్ కమిటీ

            - పోరాటసమితిల మధ్య నవంబరు 1, 3 తేదీలందు చర్చలు - ఒప్పందం అంగీకారం

           - సమ్మె ప్రతిపాదన విరమణ. 

1999     ఫిబ్రవరి 13,14 ఏ.పి.టి.యఫ్. రాష్ట్ర కార్యదర్శులలో ఒకరుగావున్న భూమయ్య తన పేరుతో హైదరాబాదులో

            విద్యాసదస్సు పేరిట నిర్మాణ రాహిత్యంగా కరపత్రం వేసి నిర్వహించి చీలికకు ఒడిగట్టినందున 

            వారిని ఏ.పి.టి.యఫ్. నుండి బహిష్కరణ. ఈ చీలికలో భాగస్వామ్యం వహించిన ఆదిలాబాద్,

            కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, గుంటూరు జిల్లా శాఖలు రద్దు.

            వీటి స్థానంలో జిల్లా అడ్హక్కమిటీల ఏర్పాటుకు రాష్ట్ర సంఘం నిర్ణయం. 

1999     జూన్ 24-పాత తాలూకా కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి, ఒప్పందాల అమలుకు 

            దశలవారీ కార్యక్రమాలలో భాగంగా ఏ.పి.టి.యఫ్. ధర్నా 

1999     జూలై 19-జిల్లా కేంద్రాలలో ఏ.పి.టి.యఫ్. ర్యాలీలు. 

1999     జూలై 21-పి.ఆర్.సి. కమీషనర్ ప్రభుత్వానికి వేతన సవరణ నివేదిక సమర్పణ, అమలుకు ఆమోదం. 

1999     నవంబర్ 15-రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మూడవ దశగా ఏ.పి.టి.యఫ్. ధర్నా 

1999     డిసెంబరు 16 హైద్రాబాద్లో ఏ.పి.టి.యఫ్. ఆధ్వర్యంలో “అందరికి విద్య-సామాజికావసరం” 

           అంశంపైవిద్యా సెమినార్. 

2000     ఏప్రిల్1న ఉపాధ్యాయసంఘాల పోరాటసమితితో విద్యామంత్రిచర్చలు - ఒప్పందం - 

           5అంశాలపైజీవో.లు జారీ. 

2000     ఆగస్టు 8 నుండి 11 వరకు రెవెన్యూ డివిజనల్ కార్యా లయాల ముందు ఏ.పి.టి.యఫ్. ధర్నా 

2000     సెప్టెంబర్ 8న సమస్యల పరిష్కారానికి, అవినీతికి, రెడ్ టేపిజానికి వ్యతిరేకంగా

            రెండవ దశ కార్యక్రమంగాజిల్లా కేంద్రాల్లో ఏ.పి.టి.యఫ్. ర్యాలీ. 

2000     అక్టోబరు 29-(నూతన నిబంధనావళి మేరకు) జె.ఏ.సి. నూతన కమిటీ ఎన్నిక, 

2000     అక్టోబరు 31-ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి (జెసిటి) ఆవిర్భావం-

            నూతన నిబంధనావళి  మేరకు కమిటీ - ఎ.నర్సింహారెడ్డి ఛైర్మన్ గా ఎన్నిక. 

2000     డిసెంబర్ 16, 17 - వరంగల్ జిల్లా హన్మకొండలో ఏ.పి.టి.యఫ్, 

            తెలంగాణా ప్రాంతీయ విద్యా మహాసభలు విజయవంతంగా నిర్వహణ 

2001     ఫిబ్రవరి 8-జె.సి.టి.ఏ. ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో భారీ ఎత్తున ప్రదర్శన, బహిరంగ సభలు. 

2001     మార్చి 9- జె.సి.టి.ఏ.తో విద్యాశాఖ కార్యదర్శి చర్చలు. మినిట్స్ విడుదల. 

2001     ఏప్రిల్ 19-జె.ఏ.సి ఆధ్వర్యంలో ఉద్యోగుల, ఉపాధ్యా యుల, కార్మికుల సమస్యలపై

            దశలవారీఆందోళనలో భాగంగా జిల్లా కేంద్రాలలో వేలాది మందితో ధర్నా..

2001     ఏప్రిల్ 22,23-జె.ఏ.సితో ప్రభుత్వ చర్చలు ఫలప్రదం, దశలవారీ ఆందోళన విరమణ,

                ఉపాధ్యాయులకుసంబంధించి 6 సమస్యలపై అంగీకారం. 

2001     జులై 16- ఏ.పి.టి.యఫ్. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా. 

2001     సెప్టెంబర్ 4-జె.సి.టి.ఏ. ఆధ్వర్యంలో హైద్రాబాద్లో 5000 మందితో ధర్నా. 

2001     సెప్టెంబర్ 16-జె.సి.టి.ఏ.తో విద్యాశాఖా మంత్రి, అధికారుల చర్చలు-సమస్యలపై హామీ-

                    సెప్టెంబర్ 24నతల పెట్టిన మహాప్రదర్శన ఉపసంహరణ, బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూలు విడుదల. 

2002     జూలై 24-జె.సి.టి.ఏ. ఆధ్వర్యాన హైదరాబాద్లో 20 వేల మంది ఉపాధ్యాయులతో ర్యాలీ,

                 బహిరంగ సభ,స్పీకర్ కు మెమోరాండం సమర్పణ. 

2002     ఆగస్టు 27-ఉపాధ్యాయ ఉద్యమ రధసారథి సింగరాజు రామకృష్ణయ్య నెల్లూరులో అస్తమయం. 

2002     ఆగస్టు 28-జె.సి.టి.ఏ. ఆధ్వర్యాన 50 వేలమంది ఉపాధ్యాయులు జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్. 

2002     నవంబర్ 11- సచివాలయం దిగ్బంధానికి జె.సి.టి.ఏ. పిలుపు-విద్యామంత్రితో చర్చలు పికెటింగ్ వాయిదా. 

2002     డిసెంబరు 27,28,29 - రాష్ట్రస్థాయి ఉద్యమ అధ్యయన తరగతులు కృష్ణాజిల్లా ఉయ్యూరులో నిర్వహణ. 

2003     జూన్ 13- 7008, 1623 ఉత్తర్వులు ఉపసంహరిం చాలని హైద్రాబాద్లో ఏ.పి.టి.యఫ్. ధర్నా 

2003     ఆగస్టు 5,6,7 - ఒప్పందాలు అమలు 1623 ఉత్తర్వు ఉపసంహరణ కోసం 

             పాతతాలూకా కేంద్రాల్లో ఏ.పి.టి.యఫ్. ధర్నా 

2003     ఆగస్టు 25- 774 ఉత్తర్వు రద్దుకోసం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయంముందు జెసిఏ ధర్నానిర్వహణ. 

2003     సెప్టెంబర్ 23-774 ఉత్తర్వును రద్దుచేసి, ప్రాథమిక విద్యను పరిరక్షించాలని,     

                    విద్యాశాఖ ఇచ్చినహామీలనునెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జెసిటీఏ ఆధ్వర్యాన 

                   హైద్రాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహణ-ప్రభుత్వానికివినతి పత్రం సమర్పణ. 

2003     డిసెంబరు 10- ట్రైబల్ వెల్ ఫేర్ కమీషనర్తో చర్చలు - మినిట్స్ జారీ. ఫలితంగా డిసెంబరు 12న

               ఏ.పి.టి.యఫ్. తలపెట్టిన ధర్నా కార్యక్రమం వాయిదా.

 2003      డిసెంబరు 16- పిఆర్షి నియామకానికి, కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించాలని,

              డియస్సినియామకాలు ఉండాలన్న వగైరా డిమాండ్ల సాధనకోసం హైదరాబాద్ లో జెసిటిఎ ధర్నా, 

2003     డిసెంబరు 18- పిఆర్ సిని నియమించాలని, ఒప్పం దాలు అమలు జరపాలని వగైరా

             డిమాండ్ల కోసంజిల్లా కలెక్టరేట్ ఎదుట జె.ఎ.సి. ధర్నా

 2004     ఫిబ్రవరి 17- అన్ని సౌలభ్యాలు ఎయిడెడ్-మున్సిపల్ ఉపాధ్యాయులకు 

            వర్తింపచేయాలని ఏపిడిఎఫ్ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా, 

2004      మార్చి 7- ఏపిటిఎఫ్ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని, 

              క్రియాశీల పాత్రనుపెంచటానికి జిల్లా కేంద్రాల్లో మహిళా సదస్సుల నిర్వహణ.

 2004     జూలై7-ఏపిటిఎఫ్కు ప్రభుత్వ గుర్తింపు ఇస్తూ 167 జీవో జారీ. 

2004     జూలై 10,11,12-అనంతపురంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర 16వ విద్యా వైజ్ఞానిక మహాసభలు

            ఘనంగా నిర్వహణ,  భారీ వూరేగింపు, ఏపిటిఎఫ్ సావనీరు-సాహిత్యం ఆవిష్కరణ.

 2004     సెప్టెంబరు 3- జిల్లా స్థాయిలో అపరిసృత సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్లముందు ఎపిటిఎఫ్ధర్నా 

2004     అక్టోబరు 18, 19 - ఏపిటిఎఫ్ జనరల్ కౌన్సిల్ నిర్వహణ. 8మంది రాష్ట్ర నాయకుల పదవీ విరమణ

            నూతనఅధ్యక్షులుగా కె. వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.వి. రాఘవయ్య ఎన్నిక. 

2004     అక్టోబరు 27- ఉమ్మడి సర్వీస్ రూల్స్ మరో నాల్గు డిమాండ్ల సాధనకోసం

              యుఎస్ఎస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రాల్లో ర్యాలీ-ధర్నా 

2004     నవంబరు 8- యుఎస్పిఎస్ ఆధ్వర్యంలో 50వేల మందితో రాజధానిలో

             ప్రభంజనంలా ర్యాలీ-బహిరంగసభ. 

2004     నవంబరు 24- పిఆర్ సి నివేదిక విడుదల కోసం జిల్లా కేంద్రాల్లో జెఏసి ధర్నా,

 

2004     డిసెంబరు 7- కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె హక్కుకై 

            ఛలోపార్లమెంట్ లోక్సభ స్పీకర్ కు మెమోరాండం సమర్పణ.

2005     జనవరి 5- ఐటిడిఏ సమస్యలపైన ధర్నాకు ఏపిటిఎఫ్ పిలుపు-చర్చలు - జీ.వో.ల విడుదల. 

2005     ఫిబ్రవరి 16- ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యాన శాసన సభ ముట్టడికి పిలుపు 

          - రాష్ట్రమంతటా అరెస్టులు, ముఖ్యమంత్రితో చర్చల ఫలితంగా ముట్టడి విరమణ. 

2005     ఫిబ్రవరి 23- విజయవాడలో రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ నిబంధనావళి సవరణ. 

2005     మార్చి-పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ట్రెజరీల ద్వారా జీతాల చెల్లింపునకు జీ.వో. 

             విడుదల. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 8.5% మధ్యంతర భృతి ఉత్తర్వులు విడుదల. 

2005     ఏప్రిల్ 3- భద్రాచలంలో ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయుల 

             రాష్ట్ర విద్యాసదస్సు/ జెసిటిఏ నాయకత్వాన పదవతరగతి, 7వ తరగతి 

             స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ-రేట్లు పెంచుతూఉత్తర్వుల విడుదల. 

2005     జూలై 7- హైదాబాదులో ఎయిడెడ్ సిబ్బంది రాష్ట్ర సదస్సు ఏసిఎఐఇ ఏర్పాటు. 

2005     ఆగస్టు- పి.ఆర్.సి. ఆమలుకు దశలవారీగా ఉద్యమం. జెఏసి పిలుపు. ప్రభుత్వంతో ఒప్పందం. 

2005     సెప్టెంబరు29- సమ్మెహక్కుకొరకు అఖిలభారత సార్వత్రికసమ్మె 

2006     జనవరి 3,4,5 - విశాఖజిల్లా మాకవరపాలెంలో రాష్ట్ర అధ్యయన తరగతుల నిర్వహణ. 

2006     జనవరి 7 - సమస్యల పరిష్కారానికై ఎ.పి.టి.ఎఫ్. ఆధ్వర్యాన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా 

2006     మార్చి 24-16 ఉపాధ్యాయసంఘాలు కలిసి ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ 

             (జాక్టో) ఆవిర్భావం.

2006     మే 22- పదోన్నతులను కోరుతూ హైదరాబాద్లో జాక్టో ఆధ్వర్యాన ధర్నా 

2006     జులై 18-సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఎ.పి.టి.ఎఫ్. ఆధ్వర్యాన ధర్నా 

2006     సెప్టెంబర్ 9,10-విజయవాడలో జరిగిన రాష్ట్రకౌన్సిల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా 

            కె. వేణుగోపాల్, షేక్ జిలానీ ఎన్నిక.. 

2006     నవంబర్ 16 - జిల్లా స్థాయి సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయాల 

           ఎదుట ఏ.పి.టి.ఎఫ్  ఆధ్వర్యాన ధర్నా 

2006     డిసెంబరు, 14- కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకువ్యతిరేకంగా 

             దీర్ఘవ్యాపిత సార్వత్రికసమ్మె 

2006     డిసెంబర్19- ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్సు రక్షణకు అప్రెంటీస్ టీచర్ల, 

            సమస్యల పరిష్కారానికైఏ.పి.టి.యఫ్. ఆధ్వర్యాన హైదరాబాద్లో ధర్నా 

2007     మార్చి 10 - ఏ.పి.టి.యఫ్. మాజీ అధ్యక్షులు యు. ఎన్. దాస్ అస్తమయం. 

2007     మార్చి 25-పునరుద్దరించిన శాసనమండలికిజరిగిన ఎన్నికలలో ఏ.పి.టి.యఫ్.

            అభ్యర్థులు ఆర్.వెంకట్రాముడు, ఏ.నరసింహారెడ్డి,సి. హెచ్.ప్రభాకరరావు,టి.హన్మాండ్లు ఓటమి. 

2007     ఏప్రిల్ 8-12 జాక్టో ఆధ్వర్యాన 5 రోజులపాటు పదవ తరగతి స్పాట్ బహిష్కరణ. 

2007     మే 29, 30 గుడివాడలో రాష్ట్ర అధ్యయన తరగతుల నిర్వహణ..

 2007     జూలై 24 - ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయాల 

             ఎదుట ఏపిటియఫ్, ధర్నా 

2007     సెప్టెంబరు 29 - ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయాల 

          ఎదుటఏ.పి. టి.యఫ్. ధర్నా, 

2007     అక్టోబరు30- కేంద్రప్రభుత్వ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల

             ఉద్యోగులదేశవ్యాప్తసమ్మె. 

2007     నవంబరు 15- మునిసిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై 

            మునిసిపల్, కార్పొరేషన్కార్యాలయాల ఎదుట ఏపిటియఫ్ ధర్నా.

2008     ఫిబ్రవరి 6, 7, 8 - ఒంగోలులో విజయవంతంగా ఏ.పి.టి.యఫ్. వక్షోత్సవాలు - 

            17వ విద్యా వైజ్ఞానిక .మహాసభలు -12 వేల మంది హాజరు.

2008     ఏప్రిల్ 9 నుండి 18 వరకు జాక్టో ఆధ్వర్యాన హైదరా బాద్ లో నిరాహారదీక్షలు, 

            11-4-2008న నిరాహారదీక్షలకు మద్దతుగా 10వ తరగతి స్పాట్ సెంటర్లవద్ద పికెటింగ్, 

             జాక్టోతో ప్రభుత్వ చర్చలు, ఒప్పందం. 

2008     జూలై 7-10 - ఉన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టుటకు 

             వ్యతిరేకంగా ఏ.పి.టి.ఎఫ్.,డి.టి.యఫ్.ల ఆధ్వర్యంలో 7,8,9తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు, 

             10వ తేదీన జిల్లా కేంద్రంలో ధర్నానిర్వహణ. 

2008     ఆగస్టు 20 - ప్రైవేటీకరణకు, అధిక ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె. 

2008     సెప్టెంబరు 5 - అంగీకరించిన అంశాలను ప్రభుత్వం అమలు పరచనందుకు నల్లబ్యాడ్జీలతో నిరసన. 

2008     అక్టోబర్22-నవంబరు3-ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాక్టో ఆధ్వర్యంలో 13 రోజులపాటు 

             విజయవంతంగా సమ్మె.95% మంది ఉపాధ్యా యులు సమ్మెలో పాల్గొన్నారు. 22న ప్రభుత్వంతోచర్చలు - 

            10 డిమాండ్లపై అంగీకారం-సమ్మె విరమణ. 

2009     నవంబర్ 2, 3, 4 - ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై 

             దశలవారీపోరాటంలో భాగంగా పాత తాలూకా కేంద్రాలలో ఏ.పి.టి.ఎఫ్. ధర్నా నిర్వహణ. 

2009     నవంబర్21-దశలవారీ పోరాటంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఏపిడిఎఫ్ ధర్నా నిర్వహణ. 

2009     డిశంబరు 5 - దశలవారీ పోరాటంలో భాగంగా ఏ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యాన హైదరాబాద్లో ధర్నా, ర్యాలీ. 

2010     ఫిబ్రవరి 24-విద్యా హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అఖిలభారత విద్యాహక్కువేదిక ఆధ్వర్యాన ఢిల్లీలో భారీర్యాలీ. 

2010     జూన్ 17- అప్రెంటీస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరి చేయాలని డిమాండ్ చేసి జాక్టోఆధ్వర్యాన 

             'చలో సెక్రటేరియేట్' వేలాదిమంది అరెస్టు. 

2010     జులై 20- మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై మునిసిపల్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద 

             ఏ.పి.టి.ఎఫ్ఆద్వర్యంలో ధర్నా నిర్వహణ. 2010 సెప్టెంబర్ 7- ధరల పెరుగుదల, 

             ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె. 

2010     సెప్టెంబర్ 18- సమస్యల పరిష్కారం కోరుతూ, ఎ.పి.టి.ఎఫ్ ఆధ్వర్యంలో 

            పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయ ముట్టడి వందలాదిమంది అరెస్టు. 

2010     సెప్టెంబర్ 29, 30 అక్టోబర్ 9,12-డైరెక్టర్ కార్యాలయలలో సమస్యల పరిష్కారం కోరుతూ 

            ఎ.పి.టి.ఎఫ్ఆధ్వర్యాన రిలే నిరాహారదీక్షలు డైరెక్టర్ తో చర్చలు ఉద్యమ విరమణ. 

2010     నవంబర్ 8,16 - జెఎసి ఆధ్వర్యాన హైదరాబాద్లో, జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్షలు. 

2010     నవంబర్ 23 - ఇంటి అద్దె ఎలవెన్సు, హెల్త్ కార్డులు, పోస్టుల భర్తీ మొదలైన డిమాండ్ల పరిష్కారానికి 

              జెఎసి ఆధ్వర్యాన హైదరాబాద్ లో భారీ ర్యాలీ. లక్షలాది మంది ఉద్యోగులు, 

            ఉపాధ్యాయులు సామూహికసెలవు. 

2011     ఫిబ్రవరి, 25 - సమస్యల పరిష్కారానికై జిల్లా కేంద్రాలలో ర్యాలీలు ధర్నాలు 

2011     మే 18 - ఏపిటిఎఫ్ ఆధ్వర్యాన డైరెక్టరేట్ ముట్టడి.. 

2011     సెప్టెబంరు 23 - ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాలలో ధర్నాలు 

2011     డిసెంబరు 3 - ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై విజయవంతంగా ‘చలో అసెంబ్లీ' 

2012     ఫిబ్రవరి 16 -విద్యారంగ బిల్లులకు వ్యతిరేకంగా 'అఖిలభారత విద్యాహక్కు వేదిక' ఆధ్వర్యాన

           జిల్లాకేంద్రాలలో ధర్నా

 2012     మార్చి 10, 11 - రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా 

              ఎన్.రఘురామిరెడ్డి, పి. పాండురంగవరప్రసాదరావుల ఎన్నిక. 

2012     జూలై 5 - అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా కౌన్సిలింగ్ కేంద్రాల ఎదుట ఏపిటియఫ్ నిరసన ప్రదర్శనలు.. 

2012     ఆగస్టు 27 - ఎయిడెడ్, మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై 

            జిల్లా కేంద్రాలలో ఏపిటియఫ్ ధర్నా.

2012     సెప్టెంబరు 25 - 10వ పి.ఆర్.సి. హెల్త్ కార్డులు మొదలైన డిమాండ్ల సాధనకై జిల్లా కేంద్రాలలో జె.ఎ.సి.ధర్నా 

2012     నవంబరు 27, 28, డిసెంబరు10న పి. ఆర్.సి. హెల్త్ కార్డులు మొదలైన డిమాండ్ల సాధనకై 

          జిల్లాకేంద్రాలలో జెఎసి ధర్నా 

2013     జనవరి, 7 - ఉపాధ్యాయ పూర్వ ప్రధాన సంపాదకులు సమతారావు అస్తమయం. 

2013     నవంబర్, 20 - పండిట్, పి.ఇ.టి పోస్టుల అప్గ్రేడేషన్, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లుతదితర 

            డిమాండ్ల సాధనకై హైదరాబాద్లో ఏ.పి.టి.ఎఫ్. ధర్నా..

 2014     జనవరి, 18 - పండిట్, పి.ఇ.టి పోస్టుల అప్గ్రేడేషన్, ఎయిడెడ్, మునిసిపల్ సమస్యల పరిష్కారంకోరుతూ

            హైదరాబాద్లో జాక్టో నిరసన దీక్ష, 

2014     మే, 28, 29, - విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు, రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ట్రకమిటీలు 

            ఆంధ్రప్రదేశ్లో ఏ.పి.టి.ఎఫ్, తెలంగాణలో టి.పి.టి.ఎఫ్ ఏర్పాటు. 

2014     ఆగష్టు, 1-11 ఉపాధ్యాయ సంఘాలతో ఫ్యాప్టో ఏర్పాటు, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్గా ఏ.పి.టి.ఎఫ్ ప్రధాన  

             కార్యదర్శి పి. పాండురంగవర ప్రసాదరావు ఎన్నిక. 

2014     అక్టోబర్, 29 - ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జిల్లా కేంద్రాలలో ఫ్యాప్టో ఆధ్వర్యాన ధర్నా 

2014     నవంబర్, 19 - ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ హైదరాబాద్లో ఇందిరా పార్కు  వద్ద 

            ఫ్యాప్టో ఆధ్వర్యాన ధర్నా. 

2015     ఏప్రియల్ 19 - క్లస్టర్ పాఠశాలల ప్రతిపాదనను విరమించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యాన 

           స్పాట్ కేంద్రాలలోనిరసన ప్రదర్శనలు. 

2015     జూన్ 30 - ప్రభుత్వ ఉత్తర్వులద్వారా బదిలీల రద్దుకై ఫ్యాప్టో ఆధ్వర్యాన జిల్లాకేంద్రాలలో ధర్నాలు. 

2016     ఫిబ్రవరి 6,7 - గుంటూరుజిల్లా తెనాలిలో రాష్ట్ర అధ్యయన తరగతులు 

2016     మార్చి 9 నుండి 15 వరకు ఫ్యాప్టో ఆధ్వర్యాన విజయవాడలో 7 రోజుల ధర్నా. 

2016     మార్చి 15 - ఫ్యాప్టో ఆధ్వర్యాన విజయవాడలో భారీ ర్యాలీ. 

2016     జూలై 22, 23, 24 - గుంటూరులో విజయవంతంగా 18వ రాష్ట్ర విద్యావైజ్ఞానిక మహాసభలు,

           8వేలమంది హాజరు. 

2016     డిసెంబరు 12 - ఎయిడెడ్ విద్యాసంస్థల సమస్యలపై ఒంగోలులో ఏపిటియఫ్ రాష్టసదస్సు. 

2017     జనవరి 6 - పనసర్దుబాటు ఉత్తర్వులను నిలుపుదలచేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారుల 

             కార్యాలయాల ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యాన ధర్నాలు. 

2017     ఏప్రియల్ 19 - జీఓ నెం. 14,15ల రద్దు కోరుతూ జిల్లాకేంద్రాలలో ఏపిటియఫ్ ధర్నాలు. 

2017     ఏప్రియల్ 24 - సిపియస్ రద్దు, ఇతర డిమాండ్లపై ఫ్యాప్టో ఆధ్వర్యాన యస్యసిసి స్పాటీకేంద్రాలలో పికెటింగ్, 

2017     జూన్ 5 - రేషనలైజేషన్, బదిలీల ఉత్తర్వుల సవరణ కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యాన డైరెక్టరేట్ ముట్టడి. 

2017     జూన్ 10 - పై సమస్యల పరిష్కారానికి విశాఖపట్నంలో విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిముందు

            ఫ్యాప్టో నిరసన ప్రదర్శన. 

2017     జూన్ 21 - పై సమస్యల పరిష్కారానికి ఫ్యాప్టో ఆధ్వర్యాన వేలాదిమందితో డిఇఓ కార్యాలయాల ముట్టడి. 

2017     గష్టు 3 - మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై ఫ్యాప్టో ఆధ్వర్యాన మునిసిపల్ కార్యాలయాల 

           ఎదుటధర్నాలు, 

2017     ఆగష్టు 13 - స్వయంపోషక స్వతంత్ర పాఠశాలలచట్టం -2017పై ఫ్యాప్టో రాష్ట్ర సదస్సు. 

2017     ఆగష్టు 17 - పైసమస్యలపై ఫ్యాప్టో ఆధ్వర్యాన మునిసిపల్ సంచాలకుల కార్యాలయం ఎదుట ధర్నా, 

2017     నవంబర్ 15 - సిపియస్ రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యాన చలో అసెంబ్లీ,